Vijayawada to Shirdi flight: గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా షిరిడీకి విమాన సేవలు..! ధర ఎంతంటే..

|

Mar 10, 2023 | 11:47 AM

షిరిడీ సాయిబాబా భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇండిగో ఎయిర్‌లైన్స్. ఇకపై విజయవాడ నుంచి షిర్డీకి నేరుగా విమాన సర్వీసు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు విజయవాడ

షిరిడీ సాయిబాబా భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇండిగో ఎయిర్‌లైన్స్. ఇకపై విజయవాడ నుంచి షిర్డీకి నేరుగా విమాన సర్వీసు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు విజయవాడ నుండి షిర్డీ వెళ్లాలంటే రోడ్డు మార్గమో.. ట్రైన్‌లోనో.. లేక హైదరాబాద్ వెళ్లి అక్కడ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఫ్లైట్‌లో షిర్డీ చేరుకునే వాళ్లు. ఇక నుంచి షిర్డీకి వెళ్లే సాయి భక్తులు విజయవాడలోనే విమానంలో ఎక్కేయొచ్చు. రోజూ రోజుకి షిర్డీకి వెళ్లే సాయి భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో గన్నవరం నుంచి నేరుగా షిర్డీకి విమానం నడపాలని ఇండిగో సంస్థ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సర్వీసు ప్రారంభ ముహూర్తంతో పాటుగా షెడ్యూల్ కుడా ప్రకటించింది. మార్చి 26 నుంచి ప్రతీ రోజు విజయవాడ నుంచి నేరుగా షిర్డీకి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రతీ రోజు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏటీఆర్ 72-600 విమానం షిర్డీకి ఖరారు చేశారు. అందులో 72 మంది ప్రయాణీకుల వెళ్లే సామర్థ్యం ఉంటుంది. ప్రతీ రోజు మధ్నాహ్నం 12గంటల 25 నిమిషాలకు గన్నవరంలో బయల్దేరే మధ్యాహ్నం 3 గంటలకు షిర్డీకి చేరుకుంటుంది. అదే విధంగా ప్రతీ రోజు షిర్డిలో మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాలకు బయల్దేరి సాయంత్రం 4గంటల 35నిమిషాలకు గన్నవరం చేరుకుంటుంది. కేవలం 2 గంటల 50 నిముషాల్లో విజయవాడ – షిరిడీ చేరుకోవచ్చన్నమాట. అలాగే గన్నవరం నుండి షిరిడీకి ప్రారంభ టికెట్ ధర 4,246 రూపాయలు కాగా.. షిర్డీ నుండి రిటర్న్ టికెట్ ధర 4,639 రూపాయలుగా నిర్ణయించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 10, 2023 09:40 AM