Watch: 25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?

|

Oct 21, 2024 | 8:52 AM

మెడలో క్యూఆర్​ కోడ్​ బోర్డ్​.. పక్కనే ఓ స్పీకర్.. చేతిలో ట్యాబ్.. బిహార్‌లోని​ బేతియాకు చెందిన యాచకుడు రాజు పటేల్‌ అవతారాన్ని చూశాం. ప్రజలు దానంగా ఇచ్చే డబ్బును ఫోన్​పే ద్వారా స్వీకరిస్తూ.. భారతదేశపు మొదటి 'డిజిటల్ బెగ్గర్'గా గతంలో సోషల్​ మీడియాలో గుర్తింపు పొందాడు.

యాచక వృత్తిని ఎంచుకున్న మరో బీహార్‌ వ్యక్తి ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. బీహార్‌లోని దర్భంగా, మధుబని రైల్వే సెక్షన్‌లో భిక్షాటన సాగించే బంభోలా అలియస్‌ సూర్‌దాస్ ఇప్పుడు మూడు ఆటోలకు ఓనర్‌. సూరదాస్ 25 ఏళ్ల క్రితం రైలులో భిక్షాటన చేయడం ప్రారంభించాడు. చూపు కోల్పోయి అంధుడిగా మారిన సూరదాస్‌ రైలులో పాటలు పాడుతూ యాచిస్తుంటాడు. తాను ఏ పనీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని, తనకు భిక్షాటన మాత్రమే ఆసరా అని సూరదాస్ మీడియాకు తెలిపాడు. యాచనే తనకు జీవితమని తెలిపాడు.

ఇప్పుడు సూరదాస్‌ కథ భిక్షాటనకే పరిమితం కాలేదు. అతను మూడు ఆటోలకు యజమాని అయ్యాడు. తనకు వచ్చే ప్రతీపైసా కూడబెట్టి ఆటోలను కొనుగోలు చేసినట్లు సూరదాస్‌ తెలిపాడు. తన యాచనతో వచ్చిన సంపాదనతోనే కుటుంబం నడుస్తుందని, యాచనను తన ఊపిరి ఉన్నంతవరకూ కొనసాగిస్తానని తెలిపాడు. కష్టాలు ఎదురైనా మనిషి తన కలలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని ఆయన చెబుతున్నాడు

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on