గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్‌ యాన్‌ ఐడియా

Updated on: Mar 21, 2026 | 1:11 PM

పెరుగుతున్న వాణిజ్య గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న సిరిసిల్ల హోటల్ నిర్వాహకుడు మహేష్, వినూత్నంగా డీజిల్ పొయ్యిని రూపొందించారు. కేవలం ₹10,000 ఖర్చుతో, నాలుగు రోజుల్లో తయారైన ఈ పొయ్యి గ్యాస్ ఖర్చును సగానికి పైగా తగ్గిస్తుందని ఆయన తెలిపారు. అవసరమే ఆవిష్కరణకు మూలం అని నిరూపిస్తూ, ఈ దేశీ జుగాడ్ ఇప్పుడు ఇతర హోటల్ నిర్వాహకులకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది.

అవసరమే ఆవిష్కరణకు మూలం అని మరోసారి నిరూపితమైంది. పెరిగిపోతున్న వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలతో బతుకు బండిని లాగలేక ఇబ్బంది పడుతున్న ఒక హోటల్ నిర్వాహకుడు, తన స్వయంకృషితో ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. డీజిల్‌తో పనిచేసే ప్రత్యేక స్టవ్‌ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అల్పాహార కేంద్రం నడుపుతున్న మహేశ్, వాణిజ్య సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో హోటల్ నిర్వహణ భారంగా మారిందని ఆవేదన చెందారు. దీనికి ప్రత్యామ్నాయంగా సుమారు రూ.10 వేల ఖర్చుతో, నాలుగు రోజుల పాటు శ్రమించి ఈ డీజిల్ పొయ్యిని రూపొందించారు. ఈ వినూత్న పొయ్యిలో ఒక చిన్న విద్యుత్ మోటారును అమర్చారు. ఆ మోటారు ద్వారా వచ్చే గాలిని ఒక పైపు ద్వారా, డీజిల్‌ను మరో పైపు ద్వారా పొయ్యి వద్దకు పంపించి మంట వచ్చేలా చేశారు. అవసరాన్ని బట్టి మంటను పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి వీలుగా రెగ్యులేటర్ కూడా అమర్చారు. సాధారణ గ్యాస్ సిలిండర్‌తో పోలిస్తే ఈ డీజిల్ పొయ్యి వల్ల ఖర్చు సగానికి పైగా తగ్గుతుందని మహేశ్ చెబుతున్నారు. ఒక లీటరు డీజిల్‌తో గంట నుంచి రెండు గంటల పాటు నిరంతరంగా పొయ్యి మండుతుందని ఆయన తెలిపారు. మహేశ్ ఆవిష్కరణను చూసిన మరికొందరు హోటల్ నిర్వాహకులు సైతం ఆకర్షితులై, తమ కోసం కూడా ఇలాంటి పొయ్యిలను తయారు చేయించుకోవడం విశేషం. సామాన్యుడి మేధస్సుతో పుట్టిన ఈ దేశీ జుగాడ్ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం

దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారి

సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న

వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం

గ్యాస్ కష్టాలకు ‘రాకెట్’ పరిష్కారం.. రిటైర్డ్ ఇంజనీర్ అద్భుత ఆవిష్కరణ

Follow Us