అమ్మదొంగా.. నువ్వు మామూలోడివి కాదురోయ్.. ముక్కంటి హుండీకే కన్నమా?
శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భక్తుడి వేషంలో వచ్చిన ఓ యువకుడు హుండీలోని నగదును దొంగిలించే ప్రయత్నం చేసి పట్టుబడ్డాడు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తతతో నిందితుడిని అదుపులోకి తీసుకోగా, అతని వద్ద నుంచి రూ.25,170 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆ దొంగ మామూలోడు కాదు.. ఏకంగా ఆ ముక్కంటి హుండీకే కన్నం వేయాలని చూశాడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలోకి ఓ వ్యక్తి భక్తుడి రూపంలో ఎంట్రీ ఇచ్చి, ఎవరికీ అనుమానం రాకుండా హుండీలోని డబ్బులను కాజేసే ప్రయత్నం చేసి చివరకు అడ్డంగా దొరికిపోయాడు. రాజమండ్రిలోని తాటితోపు తోట ప్రాంతానికి చెందిన సత్య లక్ష్మణ్ వెంకటేష్ అనే యువకుడు ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఆలయంలోని హుండీ పక్కనే ఉన్న స్తంభం పైకి ఎక్కాడు. అక్కడ నుండి హుండీ లోపలికి చేయి పెట్టి చాకచక్యంగా నగదును తస్కరించడం ప్రారంభించాడు. ఆలయ సెక్యూరిటీ ఇంచార్జ్ రవి ఈ కేటుగాడి నిర్వాకాన్ని గమనించి, వెంటనే అప్రమత్తమై ఆలయ అధికార బృందానికి సమాచారం అందించారు. అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కలిసి సదరు యువకుడిని పట్టుకుని తనిఖీ చేయగా.. అతని వద్ద హుండీ నుంచి దొంగిలించిన రూ. 25,170 నగదు లభ్యమైంది. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఆలయ అధికారులు వెంటనే శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడైన సత్య లక్ష్మణ్ వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వామివారి హుండీలోనే దొంగతనానికి పాల్పడిన ఈ కేటుగాడి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? గతంలో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్రయాణికులకు అలర్ట్.. స్మోకింగ్ చేస్తే భారీ జరిమానా.. జైలు శిక్ష !
వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్‌పాట్.. ఒకే సారి మూడు భారీ చేపలు.. ధరతెలిస్తే షాకవుతారు
Samantha: ‘నా బిడ్డే నా ప్రపంచం..’ పుట్టబోయే బిడ్డపై సమంత ఎమోషనల్ కామెంట్స్
నవ్వుల వెనుక దాగిన విషాదం.. మిమిక్రీ మూర్తి చివరి రోజులు దారుణం!