ఛాతిలో కత్తి.. అలాగే పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాలుడు.. పోలీసులు షాక్

Updated on: Sep 08, 2025 | 9:24 PM

దేశ రాజధాని ఢిల్లీలో దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాల విద్యార్థి తన చాతీలో కత్తి దిగి ఉండగానే నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఆ బాలుడిని చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఏం జరిగింది అని వివరాలు అడిగారు. పాత కక్షలతో తమ స్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు తనపై దాడి చేశారని పోలీసులకు చెప్పాడు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. సెంట్రల్ ఢిల్లీలోని ఓ పాఠశాలలో చదువుకుంటున్న 15 ఏళ్ల బాలుడు గురువారం మధ్యాహ్నం పహార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. అతడి చాతీలో కత్తి దిగి ఉండటం చూసి పోలీసులు అప్రమత్తమయ్యారు. పాఠశాల గేటు వద్ద తన ముగ్గురు స్నేహితులు తనపై దాడి చేసి కత్తితో పొడిచారని ఆ బాలుడు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆ కత్తిని సురక్షితంగా తొలగించారు.ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు దాడి జరిగిన మరుసటి రోజు సాయంత్రం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వయసు 15, 16 ఏళ్లుగా గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో ప్రతీకార దాడి కోణం ఉందని వారికి అర్థమైంది. సుమారు 10-15 రోజుల క్రితం నిందితుల్లో ఒకరిని కొందరు అబ్బాయిలు కొట్టారని, ఆ దాడి వెనుక బాధితుడి హస్తం ఉందని నిందితులు అనుమానించారని సెంట్రల్ డీసీపీ నిధిన్ వల్సన్ తెలిపారు. ఈ అనుమానంతోనే పగ పెంచుకుని బాధితుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. పథకం ప్రకారం స్కూల్ గేటు వద్ద బాధితుడిని అడ్డగించి వాగ్వాదానికి దిగారు. ఒకరు పగిలిన బీరు సీసాతో బెదిరించగా, మిగతా ఇద్దరు బాధితుడిని పట్టుకున్నారు. అదే సమయంలో మరొకరు కత్తితో చాతీలో పొడిచినట్టు విచారణలో తేలింది. నిందితుల నుంచి దాడికి ఉపయోగించిన కత్తిని, పగిలిన బీరు సీసాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై భారతీయ న్యాయ సంహిత కింద హత్యాయత్నం కేసుతో పాటు ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారీ వరదలో చిక్కుకున్న బస్సులు.. భయంతో ప్రయాణికుల ఆర్తనాదాలు

చిట్టీలు కడుతున్నారా? ఇలాంటివారు ఉంటారు.. తస్మాత్ జాగ్రత్త

అభిమాని చేసిన పనికి నివ్వెరపోయిన సంజయ్ దత్

కారు, బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే కాస్త ఆగండి..

Elephants: ఇకపై ఏనుగుల జాడ ముందే తెలిసిపోతుంది