100 రోజులు.. 200 విమానాల్లో దొంగ జర్నీ.. చివరికి ??

|

May 16, 2024 | 1:03 PM

ఓ వ్యక్తి 100 రోజుల్లో 200 విమానాల్లో ప్రయాణించాడు. వేలాది కిలోమీటర్లు తిరిగాడు. అయితే, అతను ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే. అతను ఓ దొంగ. ఢిల్లీ పోలీసులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ ప్రయాణించిన ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగ్‌ నుంచి రూ.7 లక్షలు విలువ చేసే ఆభరణాలు పోయినట్లు ఫిర్యాదు చేశారు. మరో ప్రయాణికుడు రూ.20 లక్షలు విలువ చేసే వస్తువులు కనిపించకుండా పోయాయని పోలీసులను ఆశ్రయించాడు.

ఓ వ్యక్తి 100 రోజుల్లో 200 విమానాల్లో ప్రయాణించాడు. వేలాది కిలోమీటర్లు తిరిగాడు. అయితే, అతను ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే. అతను ఓ దొంగ. ఢిల్లీ పోలీసులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ ప్రయాణించిన ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగ్‌ నుంచి రూ.7 లక్షలు విలువ చేసే ఆభరణాలు పోయినట్లు ఫిర్యాదు చేశారు. మరో ప్రయాణికుడు రూ.20 లక్షలు విలువ చేసే వస్తువులు కనిపించకుండా పోయాయని పోలీసులను ఆశ్రయించాడు. ఇదే తరహాలో వివిధ ఎయిర్‌పోర్టుల పరిధిలోనూ దొంగతనాలు నమోదయ్యాయి. ఇదంతా ఒక ముఠా పని అయ్యుంటుందని పోలీసులు అనుమానించారు. ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. ఓ అనుమానితుణ్ని అరెస్టు చేసి విచారించగా దొంగ బయటపడ్డాడు. రాజేశ్‌ కపూర్‌ అనే వ్యక్తి తన నేరాన్ని అంగీకరించాడు. ఢిల్లీ, హైదరాబాద్‌, అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టుల్లోని సీసీటీవీ ఫుటేజీలను గమనిస్తే అన్నింట్లోనూ రాజేశ్‌ కపూర్‌ అనుమానంగా కనిపించాడు. అతడిని ఢిల్లీలోని పహర్‌గంజ్‌లో ఉన్న సొంత గెస్ట్‌ హౌస్‌లో అదుపులోకి తీసుకున్నారు. కనెక్టింగ్‌ ఫ్లైట్లలో ప్రయాణంచేవారే రాజేశ్‌ కపూర్‌ లక్ష్యం.. అందులో వయసు పైబడిన మహిళలపైనే అతని గురి. విమానాశ్రయంలోనే వారి కదలికలపై నిఘావేసి.. వారి వ్యవహారశైలిని నిశితంగా గమనించేవాడు. నెమ్మదిగా అనుసరిస్తూ.. బ్యాగేజ్‌పై ఉండే స్లిప్‌ను పరిశీలించేవాడు. తద్వారా అందులో ఏయే వస్తువులు ఉన్నాయో అంచనాకు వచ్చేవాడు. బోర్డింగ్‌ గేట్‌ వద్ద వారితో మాటలు కలిపేవాడు. విమానంలోకి వెళ్లాక సిబ్బందికి ఏదో ఒక సాకు చెప్పి తాను లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి దగ్గరకు సీటును మార్పించుకునేవాడు. ఇంకా ప్రయాణికులు లోపలికి వస్తుండగానే.. నెమ్మదిగా లేచి బ్యాగేజ్‌ను సర్దుతున్నట్లు నటించేవాడు. అప్పుడే తన చేతివాటాన్ని ప్రదర్శించి విలువైన వస్తువులను కొట్టేసేవాడు. తొలుత రైళ్లలో ఈ కార్యాలను వెలగబెట్టిన అతడు.. ఓసారి పట్టుబడి పోలీసుల లాఠీ రుచిచూశాడు. ఇక లాభం లేదనుకొని అత్యంత భద్రత ఉండే విమానాలైతే ఎవరికీ దొరకననుకొని ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఢిల్లీ పహార్‌గంజ్‌లో ‘రిక్కీ డీలక్స్‌’ పేరిట రాజేశ్‌కు సొంత గెస్ట్‌ హౌస్‌ ఉంది. దాంట్లోనే అతడు మూడో అంతస్తులో నివాసముండేవాడు. ఒకప్పుడు మనీ ఎక్స్ఛేంజ్‌ బిజినెస్‌తో పాటు మొబైల్‌ రిపేర్‌ షాప్‌ను నడిపేవాడు. ఆ ఇంట్లోనే పోలీసులు పెద్ద ఎత్తున బంగారం, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. కొన్నింటిని అప్పటికే పక్క వీధిలో ఉండే నగల వ్యాపారికి విక్రయించినట్లు చెప్పాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nasa: చంద్రుడిపై రైళ్లను పరుగెత్తించనున్న నాసా !!

Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఈ సారి నైరుతి ముందే వస్తోంది..

మెట్రోను ఇలా ఎక్కితేనే ప్రశాంతం.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

తండ్రి లక్షల పెన్షన్ కోసం.. కూతురు ఏం చేసిందో తెలుసా ??

‘ధనుష్ ఒక గే’.. నా భర్తతో బెడ్ షేర్ చేసుకున్నాడు

Follow us on