బైక్ మీద వెళ్తున్న దొంగను పట్టుకోవడానికి పోలీసు సాహసం !! తెగువను చూసి నెటిజన్లు ఫిదా !!

|

Dec 01, 2022 | 9:13 AM

కొంతమంది ఖాకీలు పోలీసు వృత్తికి కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తుంటే.. మరికొందరు మాత్రం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించడానికి సైతం వెనుకాడరు.

కొంతమంది ఖాకీలు పోలీసు వృత్తికి కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తుంటే.. మరికొందరు మాత్రం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించడానికి సైతం వెనుకాడరు. నేరాలను అరికట్టడంలో ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ నేరస్తులను పట్టుకుంటూ ఉంటారు. తాజాగా ఓ దొంగ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ పోలీసు తన ప్రాణాలను పణంగా పెట్టి దొంగను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసు కానిస్టేబుల్ సత్యేంద్ర డ్యూటీలో చూపించిన తెగువను చూసి ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ చైన్ స్నాచర్ మహిళ గొలుసును లాక్కెళ్లినట్లు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందింది. ఈ విషయం తెలిసిన వెంటనే కానిస్టేబుల్ సత్యేంద్ర దొంగ కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే షహబాద్ డెయిరీ ప్రాంతంలో అతనికి ఎదురుగా దొంగ మరో బైక్‌పై పారిపోతూ కనిపించాడు. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్ సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. వాయు వేగంతో ద్విచక్ర వాహనంతో దొంగ బైక్‌ని అడ్డగించాడు. దీంతో బైక్‌ను వదిలి పారిపోతున్న దొంగను సాహసం చేసి వెంబడించి పట్టుకున్నాడు సత్యేంద్ర. ఇక, అతను పట్టుకుంది మామూలు చైన్ స్నాచర్‌ను కాదట. అతనిపై ఢిల్లీ పరిసరాల్లో చాలానే నేరచరిత్ర ఉందని సమాచారం. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వారంతా ఈ కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్లాస్టిక్ కుర్చిలో ఇరుక్కున్న లేగ దూడ తల.. చుక్కలు చూసింది !!

చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. దడ పుట్టిస్తున్న నివేదిక!

Published on: Dec 01, 2022 09:13 AM