చాట్‌జీపీటీ సాయంతో సీవీ.. చూసి షాకైన సీఈఓ

|

Oct 21, 2024 | 8:40 PM

ఉద్యోగ దరఖాస్తు కోసం చాట్‌జీపీటీని ఉపయోగించి రూపొందించిన సీవీని చూసి కంపెనీ సీఈఓ షాకయ్యారు. అభ్యర్థి పంపిన సీవీని ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం కోసం అభ్యర్థులు ఎంతో కష్టపడతారు. జాబ్‌ ఓపెనింగ్స్‌ ఉన్నాయంటే చాలు ఆకర్షణీయంగా సీవీలు రూపొందించేందుకు నానా పాట్లూ పడతారు. ఒకప్పుడు సీవీని రూపొందించాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది.

ఒకటికి పదిసార్లు చూసుకొని తప్పులు సరిచేసుకోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చాక చాలామంది దీని సాయంతో సులువుగా సీవీని క్రియేట్‌ చేసేస్తున్నారు. అలా.. ఈ ఏఐ టెక్నాలజీ సాయంతో ఓ అభ్యర్థి తన సీవీని రూపొందించి కంపెనీకి పంపాడు. అది చూసిన సీఈఓ కంగుతిన్నారు. ఎంట్రేజ్‌ సంస్థ సీఈఓ అనన్య నారంగ్‌కు ఇటీవల ఓ ఉద్యోగం కోసం దరఖాస్తు వచ్చింది. దాన్ని చూసిన ఆమె షాక్‌ తిన్నారు. సాధారణంగా చాట్‌జీపీటీని ఫలానా ఉద్యోగం కోసం దరఖాస్తు రూపొందించు అని చెబితే.. ఆ ఏఐ ప్లాట్‌ఫామ్‌ సంబంధిత టెంప్లేట్‌ను చిటికెలో క్రియేట్‌ చేసి ఇస్తుంది. అయితే అందులోని కొన్ని విషయాలను మనమే పూరించాల్సి ఉంటుంది. కానీ ఈ అభ్యర్థి చాట్‌జీపీటీ రూపొందించిన జాబ్‌ అప్లికేషన్‌ను అలాగే కంపెనీకి పంపించేశాడు. అందులో నైపుణ్యాలు, అనుభవం వద్ద ఉదాహరణ.. అని ఉండటాన్ని చూసిన సీఈఓ ఆశ్చర్యపోయారు. దరఖాస్తు కోసం అభ్యర్థి చాట్‌జీపీటీని ఉపయోగించాడనే విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆమె ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్ చేశారు. నిరుద్యోగం ఉందనడంలో ఆశ్చర్యం లేదంటూ ఆమె వ్యాఖ్యలు జోడించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

22 ఏళ్లుగా ఇలాగే ఉన్నారు.. ఇంకా ఎన్నాళ్లిలా ??

సిడ్నీ బీచ్‌లో వింత ఘటన.. బీచ్‌ మూసివేత..

CPR Training: హార్ట్ స్ట్రోక్ వస్తే పిల్లలకు..పెద్దలకు ఫస్ట్ ఎయిడ్ ఎలా చెయ్యాలి

సైన్యంలోకి కొత్తగా 14 లక్షల మంది.. ఉత్తర కొరియా ఏం చేస్తోంది