ఆ కారుకు తరచుగా రిపేర్లు.. యజమానికి రూ.కోటి ఇవ్వాలన్న కన్జ్యూమర్ కోర్టు

Updated on: Oct 08, 2025 | 6:26 PM

సాంకేతిక లోపాలు ఉన్న కారును కస్టమర్‌కు అంటగట్టినందుకు వాహన కంపెనీకి షాక్ ఇచ్చింది ఛత్తీస్​గఢ్ కన్‌స్యూమర్‌ కోర్టు. కారును మార్చాలని లేదా దాని పూర్తి ధరను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. ఛత్తీస్​గఢ్ కన్జ్యూమర్ కోర్టు ఛైర్మన్ జస్టిస్ గౌతమ్ చౌదరి, జస్టిస్ ప్రమోద్​కుమార్ వర్మలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.

రాయ్​పుర్​కు చెందిన శివాలిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ కంపెనీ తమ సీఈఓ పర్సనల్‌ వాడకం కోసం రూ.కోటికి పైగా విలువైన కారును 2023లో కొనుగోలు చేసింది. ఈ వాహనం ఛత్తీస్​గఢ్​లో అమ్మకానికి తెచ్చిన మొదటి హైబ్రిడ్‌ మోడల్. కంపెనీ సరైన పత్రాలను RTOకు అందించలేక ఆ వాహనం రిజిస్ట్రేషన్ దాదాపు ఆరు నెలలు ఆలస్యంగా జరిగింది. ఈ ఆలస్యం శివాలిక్ ఇంజినీరింగ్ అధికారులను మానసిక ఒత్తిడికి గురి చేసింది. ఈ కారును కొనుగోలు చేసిన వెంటనే అందులో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. కారు డెలివరీ అయిన కొద్దిసేపటికే ఆగిపోవడం ప్రారంభించింది. అలాగే ఇతర అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో కస్టమర్​కు ఇచ్చిన కారును మార్చాలని లేదా దాని పూర్తి ధరను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఛత్తీస్​గఢ్ కన్జ్యూమర్ కోర్టు సదరు కంపెనీని ఆదేశించింది. వాహన రిజిస్ట్రేషన్‌ ఆరు నెలలు ఆలస్యం కావడానికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని మండిపడింది. హైబ్రిడ్ వాహనాలలో విద్యుత్ లీకేజీలు వంటి సమస్యలు డ్రైవర్లు, ప్రయాణీకుల భద్రతకు తీవ్ర ప్రమాదం అని కూడా స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే ??

Paralysis: పక్షవాతం లక్షణాలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అనుకోని వరంలా మారిన ఉత్తర బెంగాల్ వరదలు

వన్డే కెప్టెన్‌గా గిల్‌ !! రోహిత్‌కు మరో షాక్‌ తప్పదా ??

నటుడు మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా