ఏటీఎంలో జింక.. ఎందుకో తెలిస్తే అయ్యో పాపం అంటారు
తరచూ అడవి జంతువులు దారితప్పి జనావాసాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలోనే పలు రకాల జంతువులు ప్రమాదాలబారిన పడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మనుషులు వాటికి హాని కలిగిస్తే, మరికొన్ని సందర్బాల్లో వీధికుక్కలు అటవీ జంతువులను వెంబడించిన ఘటనలు మనం చూస్తుంటాం.
తరచూ అడవి జంతువులు దారితప్పి జనావాసాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలోనే పలు రకాల జంతువులు ప్రమాదాలబారిన పడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మనుషులు వాటికి హాని కలిగిస్తే, మరికొన్ని సందర్బాల్లో వీధికుక్కలు అటవీ జంతువులను వెంబడించిన ఘటనలు మనం చూస్తుంటాం. తాజాగా ఓ జింక అడవి నుంచి తప్పిపోయి జనావాసాల్లోకి వచ్చింది. సరాసరి ఏటీఎంలో దూరింది. లోపలికి అయితే, దూరింది కానీ, బయటకు వెళ్లే మార్గం లేక బిక్కుబిక్కు మంటూ కనిపించింది. పాపం నోరులేని మూగజీవి అద్దాల నిర్మాణంలో బిక్కముఖం పెట్టుకుని చూస్తోంది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని అమ్రేలి ప్రాంతం ధారిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలిసింది. ఈ మేరకు స్ధానికులు వీడియో రికార్డు చేశారు. కుక్కల గుంపు వెంటపడటంతో వాటి నుంచి తప్పించుకునే క్రమంలో జింక ఏటీఎంలో చిక్కుకుపోయింది. ఏటీఎం నుంచి బయటపడే దారిలేక ఆందోళనతో జింక గంతులేస్తుండగా స్ధానికుల కంటపడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కట్నంగా కారు తేలేదని ఆ భర్త ఏం చేశాడో తెలుసా ??
బోర్ కొట్టడంతో.. సరదాగా బ్యాంక్ చోరీ చేసిన వ్యక్తి !!
రైల్వే స్టేషన్‌లో రెచ్చిపోయిన యువకుడు !! కదులుతున్న రైలునుంచి ఒక్కసారిగా..
ప్రేయసి కోసం వెళ్లి బావిలో దూకిన ప్రియుడు.. తర్వాత ??
Namrata Shirodkar: ‘ఆరోజు మా జీవితాల్లో భయానకమైనది’ నమ్రత ఎమోషనల్ !!