20 ఏళ్ల కింద చంపేశా.. కలలోకి వచ్చి హింసిస్తున్నాడు !!

Updated on: Apr 28, 2023 | 9:19 AM

ఇరవై ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని చంపి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మాయం చేశాడో వ్యక్తి. ఐతే ఇన్నాళ్ల తర్వాత ఓ విచిత్రమైన ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించాడు. తాను చంపేసిన వ్యక్తి తన కలలోకి వచ్చి రోజూ హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశాడు.

ఇరవై ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని చంపి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మాయం చేశాడో వ్యక్తి. ఐతే ఇన్నాళ్ల తర్వాత ఓ విచిత్రమైన ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించాడు. తాను చంపేసిన వ్యక్తి తన కలలోకి వచ్చి రోజూ హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశాడు. తనను రక్షించండంటూ గగ్గోలు పెడుతున్నాడు. ఈ విచిత్ర ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని కర్కాభాట్‌ గ్రామస్థుడు టికం కొలియారా అనే వ్యక్తి 2003లో ఛబేశ్వర్‌ గోయల్‌ అనే వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తాను హత్య చేసిన విషయాన్ని కొలియారా గతేడాది గ్రామస్థులతో చెప్పాడు. అతను తన భార్యకు స్నేహితుడని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో హతమార్చినట్లు తెలిపాడు. తన చేతులతో చంపిన ఛవేశ్వర్‌ ఇప్పుడు తన కలలోకి వచ్చి వేధిస్తున్నాడని గ్రామస్థులతో చెప్పుకొచ్చాడు. దీనిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోడి పిల్లలతో కుక్క స్నేహం.. నెటిజన్ల ప్రశంసలు

6000 అడుగుల ఎత్తునుంచి కింద పడి.. 72 గంటలు నరకయాతన

Balagam: స్టార్ డైరెక్టర్‌ ఫిల్మ్‌లో కీ రోల్.. బంపర్ ఆఫర్ కొట్టిన బలగం పాప !!

Published on: Apr 28, 2023 09:19 AM
Loading...
Unable to load recommendations.
Follow Us