Israel-Hamas Attacks: గాజాలో మార్చురీలు ఫుల్‌.. ఐస్‌ క్రీమ్‌ బండ్లలో డెడ్‌బాడీలు..! వీడియో..

Updated on: Oct 18, 2023 | 7:38 PM

ఇజ్రాయెల్‌-హమాస్‌ దాడులతో గాజాలో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. తిండిలేక, తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క హృదయవిదారకంగా ఉంది స్థానికుల పరిస్థితి. ఆహారం, నీళ్ల సప్లై ఆపేయడంతో తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకడం గగనంగా మారింది. బాంబు దాడుల్లో మృతిచెందినవారితో శ్మశానాలు నిండిపోయాయి. గాయాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారికి అక్కడ మందులు లేక, సరైన వైద్యం అందక చాలామంది చనిపోతున్నారు.

ఇజ్రాయెల్‌-హమాస్‌ దాడులతో గాజాలో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. తిండిలేక, తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క హృదయవిదారకంగా ఉంది స్థానికుల పరిస్థితి. ఆహారం, నీళ్ల సప్లై ఆపేయడంతో తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకడం గగనంగా మారింది. బాంబు దాడుల్లో మృతిచెందినవారితో శ్మశానాలు నిండిపోయాయి. గాయాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారికి అక్కడ మందులు లేక, సరైన వైద్యం అందక చాలామంది చనిపోతున్నారు. ఆసుపత్రుల్లోని మార్చురీలు కూడా శవాలతో నిండిపోయాయి. అటు శ్మశానాలు కూడా బిజీ అయిపోయాయి. మృతదేహాల అంత్యక్రియలకు చోటే దొరకని పరిస్థితి. మార్చురీలలోనూ ఖాళీ లేదు.. ఈ పరిస్థితుల్లో డెడ్ బాడీలను ఐస్ క్రీం బండ్లలో స్టోర్ చేస్తున్నట్లు చెప్పారు వైద్యులు. ఆస్పత్రి బయట పార్క్ చేసిన ఓ ఐస్ క్రీం వ్యాన్ లో కొన్ని మృతదేహాలను ఉంచినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐస్ క్రీం బండి కావడంతో ప్రచారం కోసం ఆ వ్యాన్ పై సదరు కంపెనీ ఐస్ క్రీంలు, వాటిని తింటూ ఎంజాయ్ చేస్తున్న చిన్నారి ఫొటోలు ఉండగా.. బండి లోపలున్న ఫ్రీజర్ లో పదుల సంఖ్యలో మృతదేహాలు ఉన్నాయని స్థానిక జర్నలిస్ట్ వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..