Watch: 25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం.! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం..
తన తండ్రిని హత్య చేసిన వ్యక్తిపై ఓ బాలిక ఊహించని రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. బ్రెజిల్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది. అది 1999. అప్పటికి జిస్లెయిన్ వయసు కేవలం 9 ఏళ్లు. ఆమెకు మరో నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఆ కుటుంబానికి ఆమె తండ్రి జివాల్డో సంపాదనే ఆధారం. ఓ రోజు ఏదో ఆటలో పందెం కాసిన జివాల్డో తన స్నేహితుడు ఆల్వెస్ కు 25 డాలర్లు బాకీ పడ్డాడు. అప్పు తీర్చే క్రమంలో ఆలస్యం జరిగింది.
అప్పు తీర్చే ప్రయత్నంలో ఉండగానే జివాల్డోను ఆల్వెస్ పాయింట్ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చి పారిపోయాడు. జివాల్డో కన్నుమూశాడు. జివాల్డో మరణంతో ఆ కుటుంబం భారమంతా జస్లెయిన్ తల్లి మీద పడింది. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. జిస్లెయిన్ తల్లి పంటిబిగువున కష్టాలను భరిస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. తమ కుటుంబానికి ఇన్ని కష్టాలకు కారణమైన ఆల్వెస్‌పై జస్లెయిన్‌కు పగ విపరీతంగా పెరిగింది. అయితే, నైతిక నియమాలను అతిక్రమించద్దన్న తల్లి ఉద్బోధతో ఆమె న్యాయప్రకారమే అతడిపై ప్రతీకారం తీర్చుకుంది.
ప్రతీకారమే ఊపిరిగా పెరిగి పెద్దయిన ఆమె 18 ఏళ్ల వయసులో న్యాయవిద్యలో చేరింది. ఆ చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరింది. కొంతకాలానికి ఆమె పోలీసు ఉద్యోగం సాధించింది. ఆ తరువాత హత్య కేసుల విచారణకు సంబంధించిన విభాగంలో పట్టుబట్టి మరీ పోస్టింగ్ వేయించుకుంది. ఆ వెంటనే ఆమె తండ్రి హంతకుడిపై దృష్టి పెట్టింది. అప్పటికే అతడు 13 ఏళ్లుగా పరారీలోనే ఉన్నాడు. ఈ హత్య కేసులో అతడిని నేర్థస్తుడిగా 2013లోనే కోర్టు తేల్చింది.
ఈ క్రమంలో నిందితుడి జాడను కనుక్కునేందుకు భూమ్యాకాశాలు ఏకం చేసిన జిస్లెయిన్ చివరకు అనుకున్నది సాధించింది. గత నెలలోనే నిందితుడి ఆచూకీ కనుక్కుని అదుపులోకి తీసుకుంది. అతడికి 12 ఏళ్ల కారాగార శిక్ష పడటంతో నిందితుడు చివరకు జైలు పాలయ్యాడు. నిందితుడు పట్టుబడ్డాక తనలో భావోద్వేగం కట్టలు తెంచుకుందని, అన్నాళ్ల పగ కన్నీటి రూపంలో బయటకొచ్చిందని ఆమె చెప్పింది. పగ, ప్రతీకారం తీర్చుకునేందుకు అడ్డదారులు తొక్కక్కర్లేదని ఈ ఉదంతంతో ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.