Andhra Pradesh: అత్తకు తలకొరివి పెట్టిన ఆదర్శ కోడలు

Updated on: Nov 06, 2025 | 1:49 PM

మానవత్వం, కుటుంబ బంధానికి అద్దం పట్టే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మగ దిక్కులేని తన కుటుంబానికి అన్నీతానై నిలబడింది ఓ కోడలు. తన అత్త ఆకస్మిక మృతితో దుఃఖాన్ని దిగమింగుకుని, తలకొరివి పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ​అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరు గున్నేపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

చెయ్యేరు ​గున్నేపల్లి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి భర్త కొంతకాలం క్రితం మృతి చెందారు. కొన్నాళ్లకు.. దురదృష్టవశాత్తూ ఆమె కుమారుడు కూడా మరణించడంతో, ఆ కుటుంబ భారమంతా ఆదిలక్ష్మి, ఆమె కోడలు శ్రీదేవి మీద పడ్డాయి. వికలాంగురాలైతన అత్త ఆదిలక్ష్మి అండతో.. ఆమె కోడలు శ్రీదేవి తన పిల్లల బాగోగులు చూసుకుంటూ ధైర్యంగా కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తక్కువ సమయంలో మామగారు, భర్త చనిపోవటంతో మగతోడు లేకపోయినా.. రెక్కల కష్టంతో కోడలు శ్రీదేవి కొండంత దిగులును దిగమింగుకొని అత్తను, పిల్లలను ఏ లోటూ లేకుండా చూసుకుంటోంది. అయితే నవంబర్ 2న మధ్యాహ్నం అకస్మాత్తుగా అత్త ఆదిలక్ష్మి మరణించడంతో ఆ కుటుంబంపై పిడుగు పడినట్లయింది. అమ్మలాగా ఆదరించిన అత్తగారు కూడా తనను వీడి వెళ్లిపోవటంతో శ్రీదేవి కన్నీటి పర్యంతమైంది. అంతలోనే దు:ఖాన్ని దిగమింగుకుని..అత్త అంతిమ క్రియలను నిర్వహించేందుకు ముందుకొచ్చింది. స్వయంగా అత్త పాడెను మోసి, చితికి నిప్పు పెట్టింది. ఈ సంఘటన స్థానికుల హృదయాలను కదిలించింది. ​కన్న కొడుకులే తల్లిదండ్రులను సరిగా పట్టించుకోని ప్రస్తుత సమాజంలో, కూతురిలాగా అత్తకు సేవలు చేసిన శ్రీదేవి.. అత్త మరణం తర్వాత కొడుకు చేయాల్సిన బాధ్యతలు నిర్వహించటం చూసి.. గ్రామస్థులు శ్రీదేవిని ప్రశంసించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

22 ఏళ్లకే రూ. 8 వేల కోట్ల ఆస్తి అమెరికాలో మనోళ్ల సత్తా ఇదీ

ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన కోతి.. నేరుగా వెళ్లి

తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి.. గదిలో సీన్‌ చూసి షాక్‌

ఏ క్షణమైనా యుద్ధంలోకి అమెరికా

9 జిల్లాల్లో పిడుగులు.. ఐఎండీ హెచ్చరికలు