వామ్మో.. అది హెయిర్ స్టైలా ?? ఈఫిల్ టవరా ??

|

Dec 26, 2022 | 9:51 AM

ప్రఖ్యాత హెయిర్ స్టైలిస్ట్ డానీ హిస్వానీ వినూత్నమైన హెయిర్‌ స్టయిల్‌తో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కాడు. హిస్వానీ దుబాయ్‌లో క్రిస్మస్ చెట్టు ఆకారంలో 9 అడుగుల 6.5 అంగుళాల పొడవు గల హెయిర్‌స్టైల్‌ను తయారు చేసాడు.

ప్రఖ్యాత హెయిర్ స్టైలిస్ట్ డానీ హిస్వానీ వినూత్నమైన హెయిర్‌ స్టయిల్‌తో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కాడు. హిస్వానీ దుబాయ్‌లో క్రిస్మస్ చెట్టు ఆకారంలో 9 అడుగుల 6.5 అంగుళాల పొడవు గల హెయిర్‌స్టైల్‌ను తయారు చేసాడు. ఈ హెయిర్ స్టైల్‌కు సంబంధించిన వీడియో తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ యూనిక్ హెయిర్ స్టైల్ చూసి డానీ ని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోలో ఓ మహిళ హెల్మెట్ ధరించి ఉంది. ఆ హెల్మెట్‌లో మూడు మెటల్ పోల్స్ కూడా ఉన్నాయి. డాని హిస్వానీ ఆ మహిళ జుట్టును క్రిస్మస్ చెట్టులా హెయిర్‌ స్టయిల్‌ చేయడానికి పొడవైన విగ్‌లు, కొన్ని బాల్స్‌ను ఉపయోగించాడు. కాగా ‘ఇది హిస్వానీ చేసిన ఎత్తైన హెయిర్‌స్టైల్ – 9 అడుగుల 6.5 అంగుళాలు’ అంటూ కాప్షన్‌ ఇచ్చారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. డాని గత ఏడేళ్లుగా ఫ్యాషన్ ప్రపంచంలో ఉంటున్నాడు. అయితే హెయిర్‌స్టైలింగ్‌ను ఒక వృత్తిగా కాకుండా ఒక కళగా భావిస్తాడు డానీ. డాని ఇంతకుముందు ఒక మహిళ తలపై హెయిర్‌స్టైల్ చేస్తున్నప్పుడు చిన్న క్రిస్మస్ చెట్టును తయారు చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి వేదికపై అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న వరుడు !! హృతిక్‌ రోషన్‌ అంటున్న నెటిజన్స్ !!

గాళ్‌ఫ్రెండ్ కోసం యువకుడి పాట్లు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

మైకేల్ జాక్సన్‌కే మతిపోయేలా ఆటోవాలాల స్టెప్పులు !! అదరహో అనాల్సిందే !!

Allu Aravind: అరిపించిన అల్లు అరవింద్ ! హీరోయిన్‌తో డ్యాన్స్‌ !

Dhamaka: కలెక్షన్లను కుమ్మేస్తున్న మాస్‌ రాజా !! ఎంతంటే ??

అమ్మో..! హీరో హమ్‌ చేస్తేనే… ఆడిటోరియం ఇంతలా దద్దరిల్లిందా !!

 

Published on: Dec 26, 2022 09:51 AM