ఒక్క గ్రామ పంచాయతీకి ఇద్దరు సర్పంచులా ?? ఇదెక్కడి ట్విస్ట్
మహబూబాబాద్ జిల్లా దామరవంచ సర్పంచ్ ఎన్నికల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికారుల తప్పిదం వల్ల ఇద్దరు మహిళలకు సర్పంచ్‌గా ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయి. మొదట ఒకరు గెలవగా, రీకౌంటింగ్ తర్వాత మరొకరు విజయం సాధించినట్లు ప్రకటించారు. దీంతో ఎవరు ప్రమాణం చేయాలో తెలియక గ్రామంలో అయోమయం నెలకొంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అధికారులు చేసిన ఓ తప్పిదం .. ఊరందరినీ గందరగోళంలో పడేసింది.. ఒకే ఊళ్లో సర్పంచ్‌గా గెలిచినట్టు ఇద్దరికి ధృవీకరణ పత్రాలు ఇవ్వడంతో ఇప్పుడు ఎవరు ప్రమాణం చేయాలనే పంచాయితీ మొదలైంది. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఓ గ్రామ పంచాయతీ ఎన్నికల ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. సాధారణంగా ఎన్నికల్లో ఒక పదవికి ఒకరే విజేతగా నిలవడం పరిపాటి. ఎన్నికల నిర్వహణలో జరిగిన పరిశీలన లోపం కారణంగా ఒకే సర్పంచ్ పదవికి ఇద్దరు అభ్యర్థులు గెలిచినట్లుగా అధికారిక ధ్రువీకరణ పత్రాలు జారీ కావడం కలకలం రేపింది. గూడూరు మండలం దామరవంచ గ్రామ సర్పంచ్ ఎవరు.. నువ్వా.. నేనా.. అంటూ ఇద్దరు మహిళలు ఇప్పుడు అధికారులను నిలదీస్తున్నారు. ఇద్దరూ ప్రమాణస్వీకారానికి సిద్ధమవడంతో ఊళ్లో అయోమయం నెలకొంది. గ్రామంలో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మొదట నూనవత్ స్వాతి 3 ఓట్లతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. విజయం సాధించినట్టు ఎన్నికల ధృవపత్రం కూడా ఇచ్చేశారు. ఐతే.. రీకౌంటింగ్ తర్వాత సీన్ మారిపోయింది. ఒక్క ఓటుతో సుజాత అనే మహిళ గెలిచినట్టు ఎన్నికల సిబ్బంది ప్రకటించారు. రీకౌంటింగ్ తర్వాత ఆమె గెలిచినట్టు ధృవీకరణ పత్రం ఇచ్చారు.ఇప్పుడు ఇద్దరి దగ్గరా ధృవీకరణ పత్రాలు ఉండడంతో సర్పంచ్ తాను అంటే.. తాను అంటూ ఇద్దరూ పోట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అధికారులు ఇవాళ ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘కమెడియన్స్‌ది ఏ స్థానమో మళ్లీ చూపించారు’ మీకో దండం
Demon Pavan: డీమాన్ పవన్‌కు జాక్ పాట్ విన్నర్ ప్రైజీ మనీకి సమానంగా నొక్కాడు
మెడికల్ మాఫియాపై ఇంట్రెస్టింగ్ సీరిస్! ‘ఫార్మా’ సిరీస్ రివ్యూ
Kajal Aggarwal: స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది
