Current bill: పూరి గుడెసెకు రూ.3 లక్షల కరెంట్ బిల్లు.. దిమ్మతిరిగి లబోదిబోమంటూ బాధితులు..
ఆంధ్రప్రదేశ్‌లో వినియోగదారులకు కరెంట్ బిల్లులు షాకిస్తున్నాయి. ఇల్లు చిన్నదా, పెద్దదా, పూరి గుడిసా, లగ్జరీ హౌసా అనేదానితో సంబంధం లేకుండా బిల్లులు మోత మోగిస్తున్నాయి. కాయకష్టం చేసుకొని ఆపూటకాపూట గడుపుకునే పేదల ఇళ్లకు కూడా లక్షల్లో బిల్లులు వేస్తూ బెంబేలెత్తిస్తున్నారు విద్యుత్ శాఖ సిబ్బంది.
అనకాపల్లి జిల్లాలోని ఎస్ రాయవరం పరిధిలోని గోకులపాడు దళిత కాలనీలో ఓ పూరి గుడిసెలో రాజుబాబు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, ఈ నెల కరెంట్ బిల్లు ఏకంగా 3,31,951 రూపాయలు రావడంతో రాజుబాబు కుటుంబం షాక్ అయింది. ఇంత చిన్న పూరి గుడిసెకు అంత పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు రావడమేంటని అధికారులను ఆశ్రయించారు. విద్యుత్ శాఖ అధికారులు రాజుబాబు బిల్లును పరిశీలించి సాంకేతిక తప్పిదం వల్ల ఈ పొరపాటు చోటుచేసుకుందని తేల్చారు. అనంతరం బిల్లును సరిచేసి ఈ నెల కరెంట్ బిల్లు 155 రూపాయలు వచ్చిందని రాజుబాబు కుటుంబానికి తెలిపారు. కాగా, ఎస్సీ రాయితీ ఉండడంతో రాజుబాబు బిల్లు చెల్లించాల్సిన అవసరంలేదని అధికారులు వివరించారు. దాంతో ఊపిరి తీసుకున్నారు రాజబాబు కుటుంబసభ్యులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...