GST Notice to Farmer: రూ.కోటి టాక్స్ కట్టాలంటూ రాజస్థాన్‌ రైతుకు జీఎస్‌టీ నోటీస్..! వీడియో

|

Jan 26, 2023 | 8:47 AM

రాజస్థాన్‌లోని ఓ రైతుకు జీఎస్‌టీ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఢిల్లీలో 90 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు చేశాడంటూ జీఎస్‌టీ అధికారులు నోటీసులు పంపించారు. ఇందుకు గాను అక్షరాల


రాజస్థాన్‌లోని ఓ రైతుకు జీఎస్‌టీ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఢిల్లీలో 90 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు చేశాడంటూ జీఎస్‌టీ అధికారులు నోటీసులు పంపించారు. ఇందుకు గాను అక్షరాల ఒక కోటి 39లక్షల 79వేల 407 రూపాయలు పన్నుగా కట్టాలంటూ నోటీసులో పేర్కొన్నారు. దీంతో చేయని వ్యాపారానికి నోటీసులు ఎంటని అతడు లబోదిబోమంటూ.. కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. జైసల్మేర్‌లోని సామ్‌ గ్రామానికి చెందిన అశోక్‌ కుమార్‌ అనే యువరైతుకు ఈ నోటీసులు అందాయి. జనవరి 5న జీఎస్‌టీ విభాగం నుంచి నోటీసులు అందాయి. దీనిపై సంబంధిత అధికారులను కలిసినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఢిల్లీలోని ఓ సంస్థ అతని పాన్‌కార్డ్‌తో లావాదేవీలు చేస్తోందని అధికారులు స్పష్టం చేశారు. దీనిపై ఫిర్యాదు చేశానని. తన వ్యక్తిగత వివరాలను జీఎస్‌టీ అధికారులకు అందించానని బాధితుడు తెలిపాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

UK’s PM office Pongal: వాహ్వా..! యూకే ప్రధాని కార్యాలయంలో పొంగల్ విందు భోజనాలు..! ఖండాలు దాటినా తెలుగు సంప్రదాయం..

Wife Murder: వీడేం మొగుడు.. భార్య అందంగా ఉందని చంపేసిన భర్త.. పెళ్లైన ఆరు నెలలకే..!

TOP 9 ET News: NTR or Charan ఈ రోజు తేలిపోవాలంతే! | డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా.!

Published on: Jan 26, 2023 08:47 AM