Crocodiles in Floods: వరదలు ఎంత పని చేసాయి రా..! ఇంట్లోకి వచ్చిన మొసళ్లు.. భయంతో పరుగులు..

Updated on: Jul 27, 2022 | 9:50 AM

దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతన్నాయి. దీంతో చాలా రాష్ట్రాల ప్రజలు వరదల భయాంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇప్పటికే పలు నదులు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అయితే


దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతన్నాయి. దీంతో చాలా రాష్ట్రాల ప్రజలు వరదల భయాంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇప్పటికే పలు నదులు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే వరద నీటిలో మొసళ్లు ఇళ్లలోకి చేరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా విశ్వామిత్ర నదిలో భారీగా నీరు వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో వడోదరలోని చాలా ప్రాంతాల్లో వరద చేరాయి. దీంతో వరద నీటితో కొట్టుకొచ్చిన మొసళ్లు స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. నీటితో పాటు మొసళ్లు కూడా వడోదర పట్టణంలోకి కొట్టుకువచ్చాయి. అపార్ట్ మెంట్ వాసులు.. తమ ఇంటి ఆవరణలోకి మొసళ్లు వచ్చాయంటూ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో వాటిని పట్టుకునేందుకు పలు బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇలా కొట్టుకువచ్చిన మొసళ్లలో చిన్నవి, పెద్దవి కూడా ఉన్నాయి. డ్రైనేజీల్లో ఎన్నో కిలోమీటర్ల మేర అవి కొట్టుకుపోయాయి. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది పలు ప్రాంతాల్లో మొసళ్లను బంధించి తీసుకెళ్లారు. ఇక ఓ ప్రాంతంలో వరదలో పూర్తిగా మునిగిపోయిన ఓ ఇంటి పైకప్పుపై ఓ మొసలి వచ్చి, చేరింది. సిమెంట్‌ రెకులపై అటుఇటు తిరుగుతూ భయాందోళనకు గురి చేసింది మొసలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Published on: Jul 27, 2022 09:50 AM