కార్పొరేట్ జాబ్ వదిలాడు.. ఆటో డ్రైవర్‌గా మారాడు..

Updated on: Dec 03, 2025 | 6:02 PM

కార్పొరేట్ ఉద్యోగ ఒత్తిడి నుండి స్వేచ్ఛ పొందేందుకు బెంగళూరుకు చెందిన రాకేష్ తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారాడు. ఆటో నడుపుతూ జీవితంలో నిజమైన ఆనందం, స్వేచ్ఛను కనుగొన్నాడు. డబ్బు ముఖ్యం కాదని, వ్యక్తిగత ఎదుగుదల, ఆత్మగౌరవమే ప్రధానమని అతను చెబుతున్న సందేశం నెటిజన్లను ఆకట్టుకుంది. ఇది సామాజిక అంచనాలను అధిగమించి ధైర్యంగా తన మార్గాన్ని ఎంచుకున్న రాకేష్ స్ఫూర్తిదాయక కథ.

కార్పొరేట్ జాబ్ చేసే ఓ యువకుడు.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఒక దశలో స్ట్రెస్ ఎక్కువై భవిష్యత్తుపై భయం పట్టుకుందని ఆటో డ్రైవర్‌గా మారిన తర్వాత ఆ భయం పోయిందని చెబుతూ చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తను కార్పొరేట్‌ బానిసను కానని జీవితానికి డబ్బు అవసరమే, అయితే అదే లక్ష్యం కాకూడదని చెప్పిన ఆ యువకుడికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. బెంగళూరుకు చెందిన రాకేష్ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారాడు. ఒకప్పుడు తాను కార్పొరేట్ జాబ్ చేసినపుడు.. లైఫ్ అయిపోయిందనే నిస్సత్తువలో ఉండేవాడినని.. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని భయపడినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ.. కొత్తగా ప్రారంభించడానికి భయపడటం లేదని చెప్పాడు. లైఫ్‌లో ఏదో పని చేస్తూ.. ఇక జీవితం అంతం అయిపోయిందని అనుకుని.. ఏం చేయాలో తెలియని వ్యక్తుల కోసమే తన సందేశమని అన్నాడు. జీవితం తనను ఓడించదని.. తన దారిలోకి ఏది అడ్డమొచ్చినా తాను ఎదుర్కొంటాననే ధైర్యాన్ని ఇప్పుడు సంపాదించినట్లు తెలిపాడు. సమాజం అంచనాల నుంచి దూరంగా ఉండటం వల్ల జీవితంపై తనకు స్పష్టత వచ్చిందని రాకేష్ అన్నాడు. ఇప్పుడు తాను అర్థవంతమైన పని, వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. డబ్బు మనిషికి అవసరమే అయినప్పటికీ.. అది జీవితంలో నిజమైన అర్థాన్ని, ఆత్మ గౌరవాన్ని కనుగొనకుండా అడ్డుకోకూడదని అతడు గుర్తు చేశాడు. మనం గొప్పగా ఏం చేయాల్సిన అవసరం లేదని.. ముందుకు సాగుతూ ఉండాలని సూచించాడు. అలాంటప్పుడు జీవితం దాని మార్గాన్ని అదే కనుగొంటుందని.. లైఫ్‌లో ఎదురయ్యే సవాళ్లకు భయపడకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని నేటి యువతకు హితవు పలికాడు. ఇక ఆ వీడియోకు.. తాను కార్పొరేట్ బానిసను కాదు.. ఆటో డ్రైవర్‌ని అంటూ ఒక టైటిల్ కూడా పెట్టాడు. రేపటి కోసం తనకు తనే ప్రేరణ ఇచ్చుకుంటున్నానని.. జీవితాన్ని వదులుకోబోతున్న వారికి సహాయం చేయడానికి తాను ప్రయత్నిస్తున్నానని రాకేష్ అన్నాడు. రాకేష్ వీడియోకు నెటిజన్లు మద్దతు తెలిపారు. సామాజిక అంచనాలను, అహాన్ని పక్కన పెట్టి కార్పొరేట్ ఉద్యోగం నుంచి.. ఆటో డ్రైవర్‌గా వృత్తి మార్చుకోవడంపై రాకేష్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. తాను ఆటో డ్రైవర్‌ను చూడటం లేదని.. సామాజిక ఒత్తిళ్లను అధిగమించిన వ్యక్తిని చూస్తున్నానని.. స్ఫూర్తిదాయకమని ఒక యూజర్ కామెంట్‌ చేసారు. ఇంకో నెటిజన్.. తాను ఒక హెచ్‌ఆర్ అని.. మార్కెటింగ్‌లో ఎంబీఏ చేసి ఇప్పుడు డ్రైవర్‌గా చేస్తున్నానని.. రాకేష్ స్టోరీ.. తన కథతో బాగా కనెక్ట్ అయిందని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉచిత బస్సులో కూర్చొన్నాడని.. ఉతికి పారేశారు.. బాబోయ్ అలా కొట్టారు ఏంటి

ఐటీ రిఫండ్‌ ఇంకా రాలేదా ?? అయితే కారణం ఇదే

అయ్యో.. బురదలో ఇరుకున్న ఏనుగు.. కట్ చేస్తే..

ర్యాపిడో బైక్‌ రైడర్‌ ఖాతాలో రూ.331 కోట్లు.. ఈడీ దర్యాప్తు

ప్రపంచంలో అతిపెద్ద శివలింగం బీహార్‌లో త్వరలో ప్రతిష్టాపన