భానుడి భగభగలు.. ట్రాన్స్‌ఫార్మర్ల ముందు కూలర్లు, ఫ్యాన్లు
ఉత్తరాదిన భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో సామాన్యులు, జంతువులు, పక్షులే కాదు చివరికి విద్యుత్ పరికరాలు కూడా ఆ వేడిని తట్టుకోలేకపోతున్నాయి. విపరీతమైన ఎండ వేడికి విద్యుత్ శాఖకు చెందిన పరికరాలు గరిష్ట లోడ్ కారణంగా అత్యంత వేడిగా మారుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న సమయంలో విద్యుత్ లోడ్ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఉష్ణోగ్రత 80 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటోంది.
ఉత్తరాదిన భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో సామాన్యులు, జంతువులు, పక్షులే కాదు చివరికి విద్యుత్ పరికరాలు కూడా ఆ వేడిని తట్టుకోలేకపోతున్నాయి. విపరీతమైన ఎండ వేడికి విద్యుత్ శాఖకు చెందిన పరికరాలు గరిష్ట లోడ్ కారణంగా అత్యంత వేడిగా మారుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న సమయంలో విద్యుత్ లోడ్ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఉష్ణోగ్రత 80 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అవి పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటిని చల్లబరిచేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది టాన్స్‌ఫార్మర్ల ముందు ఫ్యాన్లు, కూలర్లు అమరుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లోని చంబల్ కాలనీలోని విద్యుత్ గ్రిడ్‌లోని ట్రాన్స్‌ఫార్మర్, బీపీఎల్ కూడలిలోని విద్యుత్ గ్రిడ్ ఉష్ణోగ్రత 80 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. వీటిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తున్నాయి. తద్వారా వారు విద్యుత్‌ను సక్రమంగా, అంతరాయం లేకుండా సరఫరా చేయగలుగుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kangana Ranaut: గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ చేసుకున్న బ్యూటీ ?? రూమర్లకు చెక్ పెట్టిన కంగనా
క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేస్తామంటూ.. బ్యాంక్ అకౌంట్ లూఠీ
కరోనా తరహా మరో సంక్షోభం తప్పదు.. బ్రిటన్ హెచ్చరిక
మౌంట్ ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జాం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో