cook meals: 3 నెలలు.. 426 మీల్స్ వండారు.. 8 నెలలు భేషుగ్గా తిన్నారు..! అసలు ఈ ఫుడ్ గొడవ ఏంటో చూడండి..
ఉద్యోగాలు చేసే మహిళలకు ఇంటి పనులతోపాటు వంట చేయడం పెద్ద ప్రయాసే. దానికోసం చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. కొన్ని నెలలకు సరిపడా ఆహారాన్ని ముందుగానే వండేసి
ఉద్యోగాలు చేసే మహిళలకు ఇంటి పనులతోపాటు వంట చేయడం పెద్ద ప్రయాసే. దానికోసం చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. కొన్ని నెలలకు సరిపడా ఆహారాన్ని ముందుగానే వండేసి, నిల్వ చేసి పెట్టుకుంటే. మంచి ఆలోచన కదా! ఆస్ట్రేలియాకు చెందిన కెల్సీ షా అనే గృహిణికి ఇలాంటి ఆలోచనే వచ్చింది. ఆమె తన కుటుంబంతో కలిసి అమెరికాలోని ఇండియానాలో స్థిరపడింది. కుటుంబ సభ్యులకు వండి పెట్టడానికి ఆమెకు చాలా సమయం పట్టేది.దీంతో ఆహారాన్ని నిల్వ చేసే పద్ధతులపై దృష్టి పెట్టారు. ఇంటర్నెట్‌తో పాటు పుస్తకాల ద్వారా సమాచారం సేకరించారు. ఇందుకోసం రోజుకు 2 గంటలు వీడియోలకు కేటాయించారు. 3 నెలల పాటు 426 మీల్స్ సిద్ధం చేసి, నిల్వచేశారు. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఈ నిల్వ ఆహారమే వారికి దాదాపు 8 నెలలపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉపయోగపడింది. డీహైడ్రేషన్, వాటర్ క్యానింగ్ పద్ధతుల్లో ఆహారాన్ని చాలారోజులు నిల్వ చేయొచ్చని, తాజాగా ఉంటుందని కెల్సీ షా చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Pawan Kalyan: వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).
Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)
