Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం మొదటి దశ పనులు పూర్తి.. 47 పొరలతో కాంక్రీట్ బేస్‌తో నిర్మాణం.. వీడియో
అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తొలి దశలో రామాలయం పునాది పనులు చేపట్టారు.
అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తొలి దశలో రామాలయం పునాది పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మించిన కాంక్రీట్ బేస్‌పై రాళ్లతో మరో పొరను ఏర్పాటు చేయనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఈ రాతి పొర నిర్మాణంలో కర్ణాటక గ్రానైట్ , మీర్జాపూర్ ఇసుక రాయిని వినియోగిస్తున్నారు. కాగా, అయోధ్యలోని పది ఎకరాలకుపైగా స్థలంలో భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మిస్తున్న మూడంతస్తుల భవ్య రామాలయాన్ని 2024 లోక్ సభ ఎన్నికలకు ముందుగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..