Loading video

స్కాన్ తీస్తుండగా కడుపులో.. వింత కదలికలు.. ఆస్పత్రికి వెళ్లగా..

|

Mar 22, 2025 | 11:27 AM

రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో 16 సంవత్సరాలుగా ఒక యువతి కడుపులో ఇరుక్కుపోయిన నాణేన్ని ఎండోస్కోపీ ద్వారా విజయవంతంగా తొలగించారు వైద్యులు. ఆ యువతి నాలుగేళ్ల వయస్సులో అనుకోకుండా నాణెం మింగేసింది. ఇప్పుడు ఆమెకు 20 సంవత్సరాలు.. ఎంఆర్ఐ టెక్నీషియన్‌గా పని చేస్తోంది.

ఈ 16 సంవత్సరాలలో ఆమెకు ఎటువంటి సమస్య ఎదురు కాలేదు. కానీ ఆమె వైద్య పరికరాలను ఆపరేట్ చేస్తున్నప్పుడు.. అసాధారణ కదలికలు, కడుపులో తీవ్రమైన నొప్పిని అనుభవించింది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటో అర్ధంకాక.. జేఎన్ మెడికల్ కాలేజీ వైద్యుల సలహా మేరకు పొత్తికడుపు ఎక్స్-రే తీయించుకుంది. ఆ సమయంలో ఆమె కడుపులో ఒక నాణెం ఇరుక్కుపోయినట్లు గుర్తించారు డాక్టర్లు. ఎండోస్కోపీ ద్వారా ఆ నాణేన్ని విజయవంతంగా తొలగించారు. రోగులకు MRI స్కాన్‌లు చేస్తున్నప్పుడు యువతి అయస్కాంత ప్రభావం కారణంగా.. ఆమె కడుపులో వింత కదలికలు, తీవ్రమైన నొప్పిని అనుభవించిందని డాక్టర్ చెప్పారు. చిన్నప్పుడు ఆమె నాణేన్ని మింగేసినప్పుడు.. సదరు యువతి కుటుంబసభ్యులు అది శరీరం నుంచి మలం ద్వారా బయటకు వెళ్తుందని భావించారు. ఆ యువతికి ఎటువంటి సమస్య లేనందున, వారు ఇంతకుముందు ఏ వైద్యుడిని సంప్రదించలేదన్నారు. కాగా, ఇలాంటి కేసులు చాలా అరుదు అని.. అప్పుడప్పుడూ ఈ నాణేలు పేగులు చీలిపోవడానికి దారి తీస్తాయని.. కానీ ఈ కేసులో అలా జరగలేదని చెప్పుకొచ్చారు డాక్టర్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత.. క్లైమాక్స్ లో దిమ్మతిరిగే సీన్

నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..

ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..

చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌

వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..