Viral Video: వామ్మో.. రణ ధ్వని.. నిమిషం పాటు కూతపెడుతున్న కోడిపుంజు.. వీడియో
కోడి కూసిదంటే తెల్లావారింది అనుకుని నిద్ర లేస్తారు. కానీ, ఇక్కడో కోడి పుంజు చూడండి..ఇది మామూలు కోడి పుంజు కాదండోయ్..ఎందుకంటే..
కోడి కూసిదంటే తెల్లావారింది అనుకుని నిద్ర లేస్తారు. కానీ, ఇక్కడో కోడి పుంజు చూడండి..ఇది మామూలు కోడి పుంజు కాదండోయ్..ఎందుకంటే.. ఒక్కసారి అరుపు మొదలెట్టింది అంటే ఆపేందుకు నిమిషం సమయం పడుతుంది. ఆ సౌండ్ కంచు మాదిరి వినిపిస్తోంది. అరుపులో వేరియేషన్స్ కూడా చూపిస్తోంది. ఈ కోడి కానీ, మీ పరిసర ప్రాంతాల్లో ఉంటే.. మీ చెవుల్లో ఎప్పుడూ దూదులు పెట్టుకోవాల్సిందే. కాస్త అతిశయోక్తి అనుకోకపోతే కుంభకర్ణుడి టైమ్‌లో ఈ కోడి కానీ ఉండి ఉంటే.. ఆయన్ని లేపేందుకు అన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉండకపోయేది కాబోలు అంటున్నారు కొందరు నెటిజన్లు. కాగా ఎవరైనా కుంభకర్ణుడి మాదిరి నిద్రపోయే వాళ్లని లేపేందుకు ఈ కోడి ఫర్‌ఫెక్ట్ ఛాయిస్ అని చెబుతున్నారు. మొత్తం మీద నెటిజన్లు ఈ వీడియోకు ఫన్నీ కామెంట్లు పెడుతూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral video: పచ్చి మాంసమే అతడి లంచ్, డిన్నర్.. మూడేళ్ళుగా అదే ఆహారం.. వీడియో
Viral Video: తల్లి మెడకు సైకిల్ లాక్ వేసి.. తెరిచే కోడ్ మరిచిన బాలుడు.. వీడియో