Viral Video: తల్లి మెడకు సైకిల్‌ లాక్‌ వేసి.. తెరిచే కోడ్‌ మరిచిన బాలుడు.. వీడియో

Viral Video: తల్లి మెడకు సైకిల్‌ లాక్‌ వేసి.. తెరిచే కోడ్‌ మరిచిన బాలుడు.. వీడియో

Phani CH

|

Updated on: Oct 17, 2021 | 9:44 AM

పిల్లలు చేసే అల్లరి శృతిమించితే ఇదిగో ఈ బాలుడి తల్లిలా బాధపడాల్సి వస్తుంది. ఓ అల్లరి గడుగ్గాయి తల్లి మెడకు సైకిల్‌ లాక్‌ వేశాడు. అయితే ఆ లాక్‌ను తెరిచే కోడ్‌ను మరిచిపోయాడు.

పిల్లలు చేసే అల్లరి శృతిమించితే ఇదిగో ఈ బాలుడి తల్లిలా బాధపడాల్సి వస్తుంది. ఓ అల్లరి గడుగ్గాయి తల్లి మెడకు సైకిల్‌ లాక్‌ వేశాడు. అయితే ఆ లాక్‌ను తెరిచే కోడ్‌ను మరిచిపోయాడు. దీంతో భయాందోళన చెందిన ఆ తల్లి అధికారుల సహాయం కోరింది. చివరకు కట్టర్‌తో కట్‌ చేసి దానిని తొలగించారు. చైనా జియాంగ్సు ప్రావిన్స్‌లోని హువాన్‌లో ఈ ఘటన జరిగింది. సైకిల్‌ లాక్‌తో ఆడుకుంటున్న పిల్లాడు సరదాగా తల్లి మెడకు దానిని తగిలించి లాక్‌ వేశాడు. అయితే ఆట సమయంలో అన్‌ లాక్‌ కోడ్‌ను అతడు పలు మార్లు మార్చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఆ తల్లి, లాక్‌ తెరిచే కాంబినేషన్‌ తెలియక కంగారు పడింది. సమీప పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సహాయం కోరింది. వారు అగ్నిమాపక బృందాన్ని పిలిపించారు. ఒక టవల్‌ను ఆమె మెడకు ఉంచి వైర్‌ కట్టర్‌తో సైకిల్‌ లాక్‌ను కట్‌ చేసి తొలగించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: టీకా సర్టిఫికెట్‌ చూపమన్నారు అరుస్తూ.. కోపంతో ఊగిపోయిన మహిళ.. వీడియో0

Know This: అంతరిక్షం నుంచి భూమికి సిగ్నల్స్.. ఏలియన్స్ పంపినవేనా..? వీడియో