రేషన్‌ షాపులో బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. పరిశీలించి షాక్‌ తిన్న యజమాని

Updated on: Aug 11, 2026 | 11:08 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ఓ రేషన్‌ దుకాణంలో భారీ త్రాచుపాము కలకలం సృష్టించింది. బియ్యం బస్తాల వెనుక నుంచి బుసలు కొడుతున్న శబ్దాలు రావడంతో దుకాణదారు పరిశీలించగా పాము కనిపించింది. వెంటనే స్నేక్‌ క్యాచర్‌ ముజాఫర్‌కు సమాచారం అందించగా, ఆయన అక్కడికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో దుకాణదారు, వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవల పాములు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ జనాలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇళ్లు, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు.. వాహనాలు ఇలా ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ టెన్షన్‌ పెడుతున్నాయి. తాజాగా ఓ త్రాచుపాము రేషన్‌ షాపులో ప్రత్యక్షమైంది. బియ్యం బస్తాల వెనుక వింత శబ్దాలు విన్న దుకాణదారు వెళ్లి పరిశీలించగా పామును చూసి ఒక్కసారిగా భయంతో వెనక్కి పరుగుతీశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓ రేషన్ దుకాణంలో వినియోగదారులకు బియ్యం తూచి ఇస్తున్నారు. ఇంతలో బియ్యం బస్తాల వెనుక నుంచి బుసలు కొడుతూ త్రాచుపాము కనిపించింది. వెంటనే అలర్టయిన రేషన్‌ డీలర్‌ స్నేక్‌ క్యాచర్‌ ముజాఫర్‌కు సమాచారమిచ్చారు. తక్షణం అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, ఎవరికీ ఎలాంటి హానీ జరగకుండా జాగ్రత్తగా పామును పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా తీసుకువెళ్లి అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం వినియోగదారులతో కిటకిటలాడే రేషన్ దుకాణంలో ఇంత భారీ త్రాచుపాము సంచరించడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రాఫిక్‌లో పైలట్‌.. విమానంలో 175 మంది ప్రయాణికులు

భారతీయ టెక్కీలకు బిగ్‌ షాక్‌.. గ్రేస్ పిరియడ్ రద్దు!

రెంట్ బాయ్‌ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల.. డిస్కౌంట్‌ ఆఫర్లతో నిండా ముంచేస్తున్నారు

Gold Prices: పసిడి ప్రియులకు షాక్‌.. బంగారం కొనాలా? వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారు?

ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..

Loading...
Unable to load recommendations.
Follow Us