అందరికంటే ముందే 2026లోకి అడుగు పెట్టిన కిరిబాటి

Updated on: Jan 01, 2026 | 2:03 PM

ప్రపంచంలోనే 2026 కొత్త సంవత్సర వేడుకలు ముందుగా పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దేశంలోని కిరిటిమటి దీవిలో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ డేట్‌లైన్‌ కారణంగా భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ‌నం 3.30 గంట‌ల‌కే ఇక్కడ కొత్త ఏడాది ప్రవేశించింది. స్థానికులు బాణాసంచా పేలుస్తూ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. కిరిటిమటి ప్రత్యేక భౌగోళిక స్థానం, చరిత్ర గురించి ఈ కథనంలో తెలుసుకోండి.

ప్రపంచమంతా 2026 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి ద్వీప దేశంలోని కిరిటిమటి (క్రిస్మస్ ఐలాండ్) దీవిలో అప్పుడే కొత్త సంవత్సరం ఎంట్రీ ఇచ్చేసింది. ప్రపంచంలోనే అందరికంటే ముందుగా 2026కు స్వాగతం పలికిన ప్రాంతంగా కిరిటిమటి నిలిచింది. ఇంటర్నేషనల్‌ డేట్‌ లైన్‌ ఆధారంగా ఇక్కడ కొత్త సంవత్సరం ముందుగా ప్రవేశిస్తుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఇక్క‌డ మ‌ధ్యాహ‌నం 3.30 గంట‌ల‌కే కొత్త ఏడాది ప్ర‌వేశించింది. దీంతో స్థానికులు బాణాసంచా పేలుస్తూ, ఉత్సాహంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. కిరిబాటి దేశంలో అంతర్భాగమైన కిరిటిమటి దీవి.. హవాయికి దక్షిణాన, ఆస్ట్రేలియాకు ఈశాన్యంలో ఉంది. కిరిబాటిలోని ఇతర ప్రాంతాలు కూడా మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాయి. తూర్పు నుంచి పడమర వరకు దాదాపు 4,000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ దేశంలో అనేక పగడపు దీవులు ఉన్నాయి. భౌగోళికంగా హవాయికి దగ్గరగా ఉన్నప్పటికీ.. టైమ్ జోన్ల కారణంగా కిరిబాటిలో ఒక రోజు ముందుగానే న్యూ ఇయర్ వేడుకలు జరగడం విశేషం. బ్రిటన్ నుంచి 1979లో స్వాతంత్ర్యం పొందిన కిరిబాటి జనాభా సుమారు 1,16,000. దీనిని స్థానికంగా ‘కిరిబాస్’ అని పిలుస్తారు. దక్షిణ పసిఫిక్‌లో అతిపెద్ద మెరైన్ రిజర్వ్ ఇక్కడే ఉంది. కిరిటిమటి దీవి తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలు వరుసగా 2026కు స్వాగతం పలకనున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఛీ.. ఎంతకు తెగిస్తున్నార్రా.. అప్పన్న ప్రసాదంలో నత్త అంటూ ఫేక్ వీడియో

షమీకి మళ్లీ జట్టులోకి ఛాన్స్ !! గౌతమ్ గంభీర్ కు షాక్

వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్‌

పెళ్లిలోకి సడన్‌ ఎంట్రీ ఇచ్చిన డెలివరీ బాయ్‌.. ఆ తర్వాత

TOP 9 ET News: ప్రభాస్‌ నుంచి ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్ | ‘ధురంధర్‌’కి రూ. 90 కోట్ల నష్టం