పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

Updated on: Jan 21, 2026 | 9:40 AM

చిత్తూరు జిల్లా కలికిరిపల్లెలో సంక్రాంతి పండుగనాడు పెళ్లికాని యువకులు చేసిన వినూత్న ప్రచారం ఇప్పుడు వైరల్ అయ్యింది. పశువుల పండుగ వేళ, వధువులు కావాలని కోరుతూ తమ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సృజనాత్మక గోడు స్థానికులను, నెటిజన్లను ఆకట్టుకుని చర్చనీయాంశంగా మారింది, గ్రామంలో నవ్వులు పూయించింది.

ప్రస్తుతకాలంలో ప్రతి చిన్న కార్యక్రమానికీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ట్రెండ్‌గా మారింది. కార్యమేదైనా..ఇంటిముందు పెద్ద ఫ్లెక్సీ పెట్టేయాల్సిందే. అయితే.. పండగ పూట ఈ ఫ్లెక్సీ మాధ్యమంగానే తమ బాధను వెళ్లబోసుకున్నారు ఆ ఊరి పెళ్లి కాని యువకులు. ఇప్పటి వరకూ వధువు కావలెను అని పత్రికల్లో, మ్యాట్రీమోనీలో ప్రకటనలిచ్చిన యువకులు.. కాస్త వినూత్నంగా ఆలోచించి సంక్రాంతి పండుగ వేడుకల్లో ఫ్లెక్సీ మీద తమ గోడును వెరైటీగా వెళ్లబోసుకున్నారు. వధువు కావాలి అంటూ ఏకంగా తమ ఫోటోలతో సహా ఫ్లెక్సీలు పెట్టేసారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లాలోని కలికిరిపల్లె గ్రామంలో పెళ్లి కాని యువకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. పశువుల పండుగలో యువత ఇలా తమ క్రియేటివిటీ ని ప్రదర్శించడం చర్చనీయాంశం అయింది. చిత్తూరు జిల్లాలో పట్నం నుంచి పల్లెకు వచ్చిన యువకులు మూడు రోజులు పండుగ జరుపుకుంటారు. భోగి సంక్రాంతి ఆ తర్వాత రోజు కనుమ హుషారుగా జరుపుకునే యువత ఐరాల మండలం కలికిరి పల్లిలో అందరినీ ఆకట్టుకునేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. స్నేహితులు బంధువులకు కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఏర్పాటు చేయడంతో పాటు పెళ్లి కాని యువకులంతా తమకు వధువు కావాలంటూ ఫ్లెక్సీలో ఫోటోలు వేసి ఏర్పాటు చేశారు. గ్రామం నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు సందర్శకులను ఆకట్టుకుంటుండగా అందరూ వింతగా చూస్తున్నారు. యువకుల స్పెషల్ బ్యానర్లు గ్రామంలో చర్చనీయాంశంగా మారిపోగా కలికిరిపల్లి పశువుల పండుగలో నవ్వులు పూయించింది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు నెట్టింట వైరల్‌గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Medaram Jathara: వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

KA Paul: ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి

గ్రీన్‌లాండ్‌ కు సైనిక బలగాల తరలింపు

Gold Price Today: చుక్కల్ని తాకుతున్న బంగారం, వెండి ధర.. మంగళవారం ఎంత పెరిగిందంటే

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు.. వెదర్‌ రిపోర్ట్