Chittoor: అమ్మా.. నన్నెందుకిలా వదిలేశావ్‌.. జాలి కలగలేదా..

Updated on: Nov 08, 2025 | 2:02 PM

బిడ్డకు జన్మనివ్వగానే ఆ శిశువును చూసి తన కష్టమంతా మర్చిపోతుంది తల్లి. తొమ్మిది నెలలు కడుపులో మోసిన బిడ్డ కళ్ల ముందుకు రాగానే భద్రంగా పొత్తిళ్ళలో దాచుకుంటుంది. ప్రతీ క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. పశుపక్ష్యాదులు సైతం తమ పిల్లలను ఎంతో ప్రేమగా సాకుతాయి. అలాంటిది ఓ తల్లి కన్న మమకారాన్ని మరిచి, పేగు తెంచుకు పుట్టిన బిడ్డను పేడకుప్పలో పడేసింది.

బిడ్డకు జన్మనివ్వగానే ఆ శిశువును చూసి తన కష్టమంతా మర్చిపోతుంది తల్లి. తొమ్మిది నెలలు కడుపులో మోసిన బిడ్డ కళ్ల ముందుకు రాగానే భద్రంగా పొత్తిళ్ళలో దాచుకుంటుంది. ప్రతీ క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. పశుపక్ష్యాదులు సైతం తమ పిల్లలను ఎంతో ప్రేమగా సాకుతాయి. అలాంటిది ఓ తల్లి కన్న మమకారాన్ని మరిచి, పేగు తెంచుకు పుట్టిన బిడ్డను పేడకుప్పలో పడేసింది. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. బిడ్డను పెంచలేనని వదిలేసిందో.. ఇంకేమైనా జరిగిందో కానీ.. అభంశుభం తెలియని ఆ శిశువు పుట్టగానే తల్లి ప్రేమకు దూరమైంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును పేడకుప్పలో పడేసి వెళ్లిపోయింది ఆ తల్లి. అసలు ఇలా చేయడానికి ఆమెకు మనసెలా వచ్చిందో! ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలం ఎస్‌.నడింపల్లె పంచాయితీ ఎర్రంవారిపల్లెలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..చంద్రకళ అనే గిరిజన మహిళ మంగళవారం ఉదయం గ్రామంలో నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ ఓ పేడదిబ్బలో శిశువు ఏడుపు వినిపించింది. వెంటనే అక్కడి వెళ్లి చూసిన మహిళ షాకయింది. రక్తపు మడుగులో ఓ ఆడశిశువు ఏడుస్తూ కనిపించింది. ఆ బిడ్డను ఇంటికి తీసుకువచ్చిన చంద్రకళ ఆమెకు స్నానం చేయించి, స్థానిక ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్త, ఆశావర్కర్‌ సహాయంతో సోమశిల పీహెచ్‌కి తీసుకువెళ్లింది. అక్కడ శిశువుకు ప్రథమ చికిత్స చేయించారు. ఘటనపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తరువాత.. ఐసీడీఎస్‌ పర్యవేక్షకురాలు పసికందును 108 వాహనంలో శిశువిహార్‌కు తరలించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kalki 2898 AD: కల్కి 2కి హీరోయిన్‌ ఫిక్సయినట్టేనా

స్వాతంత్రం వచ్చాక తొలిసారిగా వెలిగిన కరెంటు బుగ్గ

Rhino: కొమ్ములో విషం.. స్మగ్లర్లకు శాపం..

ఇంకా పట్టాలెక్కని వందే భారత్ స్లీపర్ రైళ్లు.. ఎందుకు లేటు

నేను ఐఏఎస్‌ను.. ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా వచ్చాను

Published on: Nov 08, 2025 01:39 PM