China – Maldives: మాల్దీవుల దిశగా చైనా నిఘా నౌక.. భారత్‌పై నిఘా కోసమేనా.?
భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ హిందూ మహాసముద్రంలో తాజాగా చైనా పరిశోధక నౌక కదలికలు చర్చనీయాంశంగా మారాయి. మాలె దిశగా ప్రయాణిస్తున్న ‘షియాంగ్ యాంగ్ హాంగ్ 03’ నౌకపై మన నేవీ దృష్టిపెట్టింది. దాని కదలికల్ని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు నేవీ అధికారులు మీడియాకు తెలిపారు. ప్రస్తుతానికి ఇండియన్ ఈఈజెడ్‌లో దాని కార్యకలాపాలు మొదలైనట్లు ఇంకా తమ దృష్టికి రాలేదని అన్నారు.
భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ హిందూ మహాసముద్రంలో తాజాగా చైనా పరిశోధక నౌక కదలికలు చర్చనీయాంశంగా మారాయి. మాలె దిశగా ప్రయాణిస్తున్న ‘షియాంగ్ యాంగ్ హాంగ్ 03’ నౌకపై మన నేవీ దృష్టిపెట్టింది. దాని కదలికల్ని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు నేవీ అధికారులు మీడియాకు తెలిపారు. ప్రస్తుతానికి ఇండియన్ ఈఈజెడ్‌లో దాని కార్యకలాపాలు మొదలైనట్లు ఇంకా తమ దృష్టికి రాలేదని అన్నారు. కొన్ని వారాల్లో ఇది మాల్దీవుల తీరానికి చేరుతుందని సమాచారం. గతంలో ఇదే తరహా నౌక శ్రీలంక తీరంలో నిఘా కార్యకలాపాలు నిర్వహించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 2019లో భారత ఈఈజెడ్‌లోకి అనుమతి లేకుండా చైనా నౌక ప్రవేశించింది. ఆ వెంటనే మన నేవీ దానిని తరిమేసింది. ఈ తరహా చైనా నౌకలు గతేడాది వరకు శ్రీలంకలో లంగరేశాయి. కానీ, ఈ సారి శ్రీలంక ఇందుకు అంగీకరించ లేదు. ఈ నౌకలు సైనిక-పౌర ప్రయోజనాలకు సంబంధించనవని భారత అధికారులు ఆరోపిస్తున్నారు. వాటిలోని సాధనాలు నిఘా సమాచారాన్ని సేకరిస్తాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇవి భారత్‌లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు , గగన తలంపై నిఘా ఉంచగలవు. మన పోర్టులు, అణు కేంద్రాలపై కూడా ఓ కన్నేయగలవని తెలుస్తోంది. అయితే, తమ పరిశోధక నౌకను సాధారణ దృష్టితో చూడాలని గతంలో భారత్‌ను ఉద్దేశించి చైనా వ్యాఖ్యానించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos