తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు

Updated on: Dec 27, 2025 | 7:54 PM

చైనాలో ఒక యువకుడు, బ్రేకప్ చెప్పిన తన మాజీ ప్రియురాలిపై కోర్టులో దావా వేశాడు. రిలేషన్‌షిప్‌లో ఉండగా ఆమెపై పెట్టిన 30 వేల యువాన్ల ఖర్చులు, ఎంగేజ్‌మెంట్ కట్నంగా ఇచ్చిన 20 వేల యువాన్లు కలిపి మొత్తం 50 వేల యువాన్లు తిరిగి ఇప్పించాలని కోరాడు. అయితే, వ్యక్తిగత ఖర్చులు భావోద్వేగ బంధానికి సంబంధించినవని కోర్టు కొట్టివేసింది. కానీ, కట్నంలో సగం (10 వేల యువాన్లు) తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చింది.

విడాకులు తీసుకున్న తర్వాత తన పోషణ కోసం మాజీ భర్త నుంచి భరణం కోరడం సాధారణం. అయితే, తనకు బ్రేకప్ చెప్పి వెళ్లిపోయిన ప్రియురాలిని ఓ యువకుడు కోర్టుకీడ్చాడు. రిలేషన్‌లో ఉన్న కాలంతో తన సొమ్మంతా తన తిండికే సరిపోయిందని, అది గాక బహుమతులు, షాపింగ్ అంటూ తనచేత 30 వేల యువాన్లు ఖర్చు పెట్టించిందంటూ అతడు కోర్టుకెక్కాడు. ఎలాగైనా తాను పెట్టిన ఖర్చును ఇప్పించాలంటూ కోర్టులో ఆ యువకుడు వాపోయాడు. నార్త్ ఈస్టర్న్ చైనాలోగల హిలోంజియాంగ్ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన యువకుడు హె కి, వాంగ్ అనే యువతితో మాట్రిమోని యాప్‌లో పరిచయం ఏర్పడింది. ఆపై ఇరువురూ కొంతకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆ సమయంలో హె తల్లిదండ్రులకు చెందిన హోటల్‌లో వాంగ్ పనిచేసింది. అప్పుడే హె, వాంగ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ టైంలో సంప్రదాయం ప్రకారం హె తల్లిదండ్రులు.. కాబోయే కోడలుకు 20 వేల యువాన్లు కానుకగా ఇచ్చారు. ఎంగేజ్‌మెంట్‌ తర్వాత ఆరు నెలల తర్వాత. ఆమె తీరు నచ్చక హె..ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నాడు. వాంగ్‌కు పనికన్నా తిండిపైనే ధ్యాస ఎక్కువ అని, ఎప్పుడూ షాపింగ్ అంటూ తనచేత దుస్తులు, మేకప్ సామాన్లు వంటివి బోలెడు కొనిపించిందని ఆరోపించాడు. అందుకు 30 వేల యువాన్లు ఖర్చయిందని, బ్రైడ్ ప్రైస్‌గా ఇచ్చిన 20 వేల యువాన్లు కలిపి మొత్తం 50 వేల యువాన్లు (దాదాపు రూ.6.3 లక్షలు) తిరిగి ఇప్పించాలని కోర్టులో దావా వేశాడు. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి.. ప్రియురాలు/ ప్రియుడి కోసం కొన్న వస్తువుల విషయంలో ఎమోషనల్ బాండింగ్ ఉంటుందని, కనుక ఆ సొమ్ము తిరిగివ్వమనడం సరికాదని కేసు కొట్టేసారు. అయితే, బ్రైడ్ ప్రైస్ గా ప్రియుడి కుటుంబం ఇచ్చిన 20 వేల యువాన్లలో సగం సొమ్ము తిరిగివ్వాలని ప్రియురాలిని కోర్టు ఆదేశించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి

అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

జనవరిలో అమలులోకి రానున్న కొత్త రూల్స్‌ ఇవే

Bad Girl Review: కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ

Patang Movie Review: మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే