Children in Car dicky: కారు డిక్కీలో చిన్నారులు.. షాక్‌ ఇచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు.. వైరల్ వీడియో.

|

Sep 13, 2022 | 9:21 AM

కొందరు వాహనదారులు రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేస్తుంటారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారీతిన వాహనాలు నడుపుతారు. ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు


కొందరు వాహనదారులు రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేస్తుంటారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారీతిన వాహనాలు నడుపుతారు. ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తున్నా, వాహనాలను సీజ్‌ చేస్తున్నా వీరిలో మాత్రం మార్పురావడం లేదు. ఈనేపథ్యంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో తల్లిదండ్రులు తమ పిల్లలను కారు డిక్కీలో కూర్చోబెట్టారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు పిల్లలను కూర్చొబెట్టి పేరెంట్స్ మాత్రం ముందు వరుసలో కూర్చున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ఓ బొమ్మను ఇచ్చి కారులో దూసుకుపోతున్నారు. కాగా.. ఈ కారు వెనకాల వెళుతున్న మరో కారులోని వారు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. నంబర్ ప్లేట్ బాగా కనిపించేలా జూమ్ చేసి మరీ ఈ వీడియోను తీశారు. అనంతరం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘వారు బాధ్యత లేని తల్లిదండ్రుల్లా ఉన్నారు? దయచేసి ఈ వీడియోను చూసి తగు చర్యలు తీసుకోండి’ అని కేటీఆర్‌, తెలంగాణ ట్రాఫిక్‌ పోలీసులు, టీఎస్‌ఆర్టీసీ ఎండీల పేర్లను ట్యాగ్‌ చేశారు. ఈ పోస్టుపై స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కారు నంబర్ ప్లేట్‌ ఆధారంగా చలాన్ విధించారు. ‘సార్‌.. మీ ఫిర్యాదు మేరకు సదరు వాహనదారుడికి ఈ-చలాన్ పంపాం. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో చేతులు కలిపినందుకు ధన్యవాదాలు’ అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 13, 2022 09:14 AM