చేతిరాత బడ్జెట్టును ప్రవేశపెట్టిన మంత్రి వీడియో

Updated on: Mar 15, 2025 | 5:06 PM

చేతి రాతలు, పేపర్లు కనుమరుగవుతున్న నేటి కంప్యూటర్‌ కాలంలోనూ సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ వార్తల్లో నిలిచారు ఛత్తీస్‌గఢ్ ఆర్థిక మంత్రి ఒ.పి. చౌదరి. ప్రస్తుత టెక్నాలజీ యుగంలోనూ ఆయన అసెంబ్లీలో చేతిరాతతో రాసిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు. చేతి రాతతోనూ పూర్తి బడ్జెట్‌ను ఆయన రూపొందించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను సుమారు రూ.1.65 లక్షల కోట్లతో ఆయన శాసనసభకు సమర్పించారు.

సాధారణంగా బడ్జెట్ పత్రాలను అధికారులు కంప్యూటర్ల ద్వారా రూపొందిస్తుంటారు. అయితే, చౌదరి మాత్రం తన భావాలు, దార్శనికత, రాష్ట్రం పట్ల తన నిబద్ధతను చేతిరాత ద్వారానే మరింత స్పష్టంగా వ్యక్తం చేయగలనని భావించారు. అందుకే వంద పేజీల బడ్జెట్‌ను స్వయంగా హిందీలో రాశారు. ఈ బడ్జెట్ రూపకల్పన కోసం ఆయన రోజుకు గంట.. గంటన్నర మాత్రమే నిద్రపోయారని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే తాను ఐఏఎస్ అధికారిగా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపిన చౌదరి … చేతితో రాసిన బడ్జెట్ పత్రం పారదర్శకతకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ తయారీకి దాదాపు 5 నుంచి 6 నెలల సమయం పట్టిందని, అయితే బడ్జెట్‌లోని అంశాలను మాత్రం చివరి 10 రోజుల్లో రాశానని ఆయన తెలిపారు. 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా పనిచేసిన చౌధరి, 2018లో రాయ్‌పూర్ కలెక్టర్‌గా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2018లో ఓడిపోయినప్పటికీ, 2023లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం :

రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో

ఆనందంగా పెళ్లి ఊరేగింపు..అంతలోనే ప్రమాదం వీడియో

ఎగురుతున్న విమానాన్ని వెనక్కి రప్పించిన టాయిలెట్‌ వీడియో

మిమ్మల్ని నేను తీసుకొస్తా… సునీతకు ట్రంప్‌ సందేశం వీడియో