ఉదయం ఇంట్లోనుంచి బయటకు రాగానే.. భయానక దృశ్యం.. ఇలా ఉన్నారేంట్రా
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని బేతాళవాడలో కొండ మాంతయ్య, మదునయ్య ఇళ్ల ముందు తెల్లవారుజామున క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయి. నల్లటి ముగ్గులు, కోసిన నిమ్మకాయలు, పసుపు-కుంకుమ చూసి కుటుంబ సభ్యులు, స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పట్టణంలోని బేతాళవాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న కొండ మాంతయ్య, కొండ మదునయ్య అనే అన్నదమ్ముల ఇళ్ల ముందు తెల్లవారుజామున నల్లటి ముగ్గులు, వాటిపై కోసిన నిమ్మకాయలు, పసుపు–కుంకుమ కనిపించడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల ముందు ఈ దృశ్యాలను చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన రెండు ఇళ్లను టార్గెట్ చేసి క్షుద్ర పూజలు నిర్వహించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లని ముగ్గు వేసి, పసుపు, కుంకుమలు చల్లి, నిమ్మకాయలు, ఇతర పూజా సామాగ్రి కనిపించడంతో ఇది కావాలని చేసిన పనిగా బాధితులు భావిస్తున్నారు. ఈ ఘటనపై బాధితులు చెన్నూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లను పరిశీలించారు. ఎవరు, ఏ ఉద్దేశంతో ఈ పనికి పాల్పడ్డారన్న దానిపై విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని బాధితులు పేర్కొన్నారు. పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బేగంపేట స్టేషన్‌లో దిగిన మహిళ.. ఆమె తెచ్చిన భారీ సూట్‌కేస్ తెరిచి చూడగా షాక్
మనాలీని కమ్మేసిన మంచు.. చిక్కుకుపోయిన వాహనాలు
అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుడు.. ఒక్కసారిగా..