Man Killed Parents: ఓ కుమారుడు చేసిన ఘనకార్యం.. వృద్ధులనే కనికరం లేకుండా తల్లిదండ్రులను చంపి రెండు రోజులు..

|

Dec 03, 2022 | 8:17 PM

తల్లిదండ్రులు.. వృద్ధులనే కనికరం లేకుండా ఓ కుమారుడు కిరాతకంగా హతమార్చాడు. వారి మృతదేహాలతో రెండు రోజులు కాలం గడిపాడు. చివరకు దుర్వాసన రావడంతో స్థానికుల ద్వారా ఈ జంట హత్య వెలుగులోకి వచ్చింది.


తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభ కోణం సమీపంలోని పట్టీశ్వరం గ్రామానికి చెందిన గోవిందరాజ్‌, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. పెద్దకుమారుడు రవిచంద్రన్‌ అగ్నిమాపక శాఖలో పనిచేస్తూ ప్రమాదం రూపంలో గతంలో మరణించాడు. ఇక, కుమార్తె గీత పెళ్లయిన కొన్నాళ్లకు మరణించింది. రెండో కుమారుడు రాజేంద్రన్‌కు వివాహం కాలేదు. ఇతడు తల్లిదండ్రులతో కలిసి తిల్లయంబూరులో నివాసముంటున్నాడు. తనకు పెళ్లి కాలేదన్న వేదనతో మానసికంగా కృంగి ఓ రోగిగా మారాడు. దీంతో తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. వారిద్దరిని చితక్కొట్టేవాడు. మళ్లీ పశ్చాత్తాపంతో వారి వద్దే ఉండేవాడు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులతో జరిగిన గొడవలో రాజేంద్రన్‌ ఉన్మాదిగా మారిపోయాడు. ఇంటిలో వేట కొడవలితో తల్లిదండ్రులిద్దరినీ అతి కిరాతకంగా చంపేశాడు. తల, కాలు, చేతులపై ఇష్టం వచ్చినట్లు నరికేశాడు. ఆ ఇద్దరు మరణించడంతో.. ఏమీ ఎరుగనట్లుగా ఆ మృతదేహాలతో రెండు రోజులు కాలం వెళ్లదీశాడు. అయితే రెండు రోజుల తర్వాత తీవ్ర దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారమిచ్చారు. స్పాట్‌కు చేరుకున్న పట్టీశ్వరం పోలీసులు అక్కడ కనిపించిన దృశ్యంతో షాక్ అయ్యారు. మంచం మీద రెండు మృతదేహాల మధ్య పడుకుని ఉన్న రాజేంద్రన్‌ను గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా తానే హతమార్చినట్టు అంగీకరించాడు. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుంభకోణం ఆసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Published on: Dec 03, 2022 08:17 PM