Chennai gambler: ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో చీకటి వ్యాపారం.. హద్దు మీరుతున్న ఆగడాలు..!

|

Dec 22, 2022 | 9:06 AM

ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో పేకాట క్లబ్ ఆగడాలు హద్దు మీరుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పేకాటపై నిషేధం విధించడంతో పక్క రాష్ట్రాలకు పేకాటరాయుళ్లు వలస బాట పడుతున్నారు.


ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో పేకాట క్లబ్ ఆగడాలు హద్దు మీరుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పేకాటపై నిషేధం విధించడంతో పక్క రాష్ట్రాలకు పేకాటరాయుళ్లు వలస బాట పడుతున్నారు. తిరువళ్లూరు జిల్లా ఎగుమధురలో పేకాట క్లబ్ ఏర్పాటు చేశారు ఏపీకి చెందిన వ్యక్తులు. ఏపీలో అనుమతులు లేకపోవడంతో సరిహద్దుల్లో ఈ క్లబ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తమకు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల సపోర్ట్ ఉందంటున్న నిర్వాహకులు.. తిరుపతి జిల్లా శ్రీసిటీకి సమీపంలో క్లబ్ నిర్వహిస్తున్నారు. విజయవాడ గుంటూరు నుంచి సైతం నెల్లూరు మీదుగా తమిళనాడుకు చేరుకుంటున్నారు పేకాట రాయుళ్లు. ఇక్కడ పేకాట క్లబ్‌లను ఏర్పాటు చేసిన నిర్వాహకులు రోజు కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో సమీప గ్రామాల్లో హంగామా నెలకొంది. దీనిపై గ్రామస్తులు నిలదీయడంతో వారిపై దాడులకు తెగబడ్డారు. పేకాట క్లబ్ నిర్వాహకుల ఆగడలపై ఎవరైనా పోలీసులకు సమాచారం ఇస్తే స్థానికుల పైనే దాడికి తెగబడుతున్నారు. శ్రీసిటీ మీదుగా క్లబ్‌కు వెళుతున్న పేకాట రాయుళ్లు.. సరిహద్దు గ్రామాల్లో హంగామా సృష్టిస్తున్నారు. వీరి ఆగడాలు భరించలేక స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందిస్తే కోట్లలో జరుగుతున్న ఈ చీకటి వ్యాపారానికి తెర దించాలంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 22, 2022 09:06 AM