Maharashtra: పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చి మూడు పిల్లలకు జన్మనిచ్చిన ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బాలాపూర్ గ్రామంలో జరిగింది. వారం రోజులుగా ఓ చిరుత ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఆరుగురు వ్యక్తులపై దాడి చేసింది. ఈ దాడి ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అంతేకాదు ఆ చిరుత పలు జంతువులపైనా దాడిచేసి హతమార్చింది. బాలాపూర్ గ్రామ పొలిమేరలో రైతు డిమ్‌దేవ్ సలోటేకు చెందిన పశువుల పాక ఉంది.
ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చి మూడు పిల్లలకు జన్మనిచ్చిన ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బాలాపూర్ గ్రామంలో జరిగింది. వారం రోజులుగా ఓ చిరుత ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఆరుగురు వ్యక్తులపై దాడి చేసింది. ఈ దాడి ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అంతేకాదు ఆ చిరుత పలు జంతువులపైనా దాడిచేసి హతమార్చింది. బాలాపూర్ గ్రామ పొలిమేరలో రైతు డిమ్‌దేవ్ సలోటేకు చెందిన పశువుల పాక ఉంది. పశువుల పాకలో దూరిన చిరుత సోమవారం ఉదయం మూడుపిల్లలకు జన్మనిచ్చింది.
సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరడంతో చిరుత పారిపోయింది. పాకలో అరుపులు వినిపించడంతో వెళ్లి చూసిన స్థానికులకు మూడు చిరుత పిల్లలు దర్శనమిచ్చాయి. అటవీ అధికారులకు సమాచారమివ్వడంతో రంగంలోకి దిగిన అటవిశాఖ సిబ్బంది చిరుత పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పిల్లలు కనిపించక పోవడంతో తల్లి చిరుత గ్రామం పై విరుచుకు పడవచ్చని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అటవి అధికారులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.