Love Marriage: ఆంధ్రా అబ్బాయి.. తైవాన్ అమ్మాయి… వెంకన్న సన్నిధిలో పెళ్లి
దేశాలు వేరు.. భాషలు వేరు.. అయినా వారి మనసు ఒకటే.. ఇద్దరి మనుషులు కలిసి జీవించడానికి దేశాలు, భాషలు, ప్రాంతాలు అడ్డుకావని మరోసారి ఓ ప్రేమ జంట రుజువు చేసింది. ఇటీవల కాలంలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన అబ్బాయిలు, అమ్మాయిలు విదేశస్థులతో వివాహం చేసుకున్న ఘటనలు అనేకం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కింది. ప్రేమ జంట వివాహం పవిత్ర పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో
దేశాలు వేరు.. భాషలు వేరు.. అయినా వారి మనసు ఒకటే.. ఇద్దరి మనుషులు కలిసి జీవించడానికి దేశాలు, భాషలు, ప్రాంతాలు అడ్డుకావని మరోసారి ఓ ప్రేమ జంట రుజువు చేసింది. ఇటీవల కాలంలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన అబ్బాయిలు, అమ్మాయిలు విదేశస్థులతో వివాహం చేసుకున్న ఘటనలు అనేకం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కింది. ప్రేమ జంట వివాహం పవిత్ర పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన వేమూరి కిషోర్ మెడికల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తారు. ఆయన కుమారుడు సాయి దినకర్ తైవాన్ దేశంలో సించున్ సిటీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అక్కడే సాయి దినకర్ కు ఫిజియోథెరపిస్ట్ గా పని చేస్తున్న యుటింగ్ లీయు అనే యువతీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. సాయి దినకర్, యూటింగ్ లీయు లు తమ ప్రేమని తమ కుటుంబ సభ్యులకు చెప్పారు. పెళ్ళి చేసుకోవడానికి ఒప్పించారు. దీంతో వీరి ప్రేమ పెళ్లిపీటలు ఎక్కింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొదటిసారి అద్దంలో చూసుకున్న ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి..
చంద్రునిపై రెండెకరాలు గిఫ్ట్‌గా పొందిన తెలుగోడు !! నాసాకు 50వేల డాలర్లు గిఫ్ట్
దారికి అడ్డంగా ఉందని.. గ్రేట్‌వాల్ ఆఫ్ చైనానే తవ్వేశారు..
కోనసీమ కొత్త కోడలికి అద్దిరిపోయే కానుక.. నిశ్చితార్థంలోనే ఇలా ఉంటే..
వింత ఆచారం.. దేవుడికి తేళ్లతో నైవేద్యం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు