Tiger Cubs: తిరుపతి జూలో పులిపిల్లలు సీసీ కెమెరా దృశ్యాలు..

|

Mar 10, 2023 | 1:32 PM

తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేపిన పులిపిల్లల ఎపిసోడ్‌కు అటవీశాఖ అధికారులు ముగింపు పలికారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో గుర్తించిన 4 పులి పిల్లలను తిరుపతి జూకు తరరించారు.

అడవిలో అమ్మపులి .. అడవి బయట పులి కూనలు. నాలుగు రోజులుగా తల్లి కోసం ఎదురుచూసిన పసికూనలు..ఎట్టకేలకు తిరుపతి ఎస్పీ జూపార్క్‌కి చేరుకున్నాయి. అమ్మ పులి కోసం చేపట్టిన ఆపరేషన్ మదర్ టైగర్ T108 సక్సెస్‌ కాలేదు. పులిపుల్లలు లభ్యమైనప్పటి నుంచి తల్లి పులి కోసం అటవీ అధికారులు 300 మంది సిబ్బంది, 40 ట్రాప్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పులి పిల్లలను తల్లితో కలిపే ప్రయత్నం చేశారు. అది కాస్త విఫలం కావడంతో ఆత్మకూరు నుంచి తిరుపతి జూకు తరలించారు. ఎస్పీ జూకి తీసుకొచ్చిన అధికారులు పులి పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పులి పిల్లలను జూలో ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 10, 2023 01:32 PM