Cat fight with fox: నక్కలకు చుక్కలు చూపించి తరిమికొట్టిన పిల్లి.. హ్యాట్సాఫ్‌ క్యాట్‌..అంటున్న నెటిజన్లు.. వీడియో

|

Nov 15, 2021 | 8:18 AM

సోషల్‌ మీడియాలో మనం రోజూ జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు చూస్తుంటాం. అవి కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

YouTube video player
సోషల్‌ మీడియాలో మనం రోజూ జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు చూస్తుంటాం. అవి కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే మీరు కచ్చితంగా నవ్వుకోవడమే కాదు.. హ్యాట్సాఫ్‌ అంటారు.. ఎందుకో వీడియో చూస్తే సరి…

ఈ వీడియోలో ఒక పిల్లి రెండు నక్కలతో కలబడటం స్పష్టంగా చూడొచ్చు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించబోయిన రెండు నక్కలకు ఆ పిల్లి చుక్కలు చూపించింది. మరోసారి పిల్లి జోలికి వెళ్లాలంటేనే భయపడేలా నక్కలను తరిమికొట్టింది ఆ పిల్లి. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి వేలాదిమంది నెటజన్లు పిల్లి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఏం ధైర్యం రా బాబూ అంటూ కితాబిస్తున్నారు. ‘పిల్లి భయపెట్టిన తీరు మామూలుగా లేదు’ అంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రమ్ ఐడీ నేచర్ 27_12 అనే అకౌంట్‌లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Published on: Nov 15, 2021 07:59 AM