చిల్లర లేదన్న ప్రయాణికుడు.. చితక బాదిన మహిళా కండక్టర్‌

Updated on: Jul 01, 2025 | 6:20 PM

బస్సులో ప్రయాణికుడు చిల్లర లేదని చెప్పడంతో అతనిపై చేయి చేసుకుంది ఓ మహిళా కండక్టర్‌. వృద్ధుడైనా ఆ ప్రయాణికుడి చొక్కాపట్టుకొని దాడి చేసింది. ఈ ఘటన కృష్ణాజిల్లా ఉయ్యూరులో జరిగింది. గురువారం తోట్లవల్లూరు మండలం కనకదుర్గ కాలనీ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనను కొందరు వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో వివాదం పెద్దదిగా మారింది.

తోట్లవల్లూరు అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద పెద్దిబోయిన మల్లిఖార్జునరావు ఉయ్యూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. టికెట్ కోసం మహిళా కండక్టర్‌కు రూ.200 నోటు ఇవ్వగా.. పెద్ద నోటు ఇస్తే ఎట్లా? అంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై.. ఘర్షణకు దారితీసింది. వివాదం పెద్దది కావడంతో కనకదుర్గ కాలనీ వద్ద మహిళా కండక్టర్ వృద్ధుడిని బస్సు దింపేసి అతడిపై దాడి చేసింది. ఈ ఘటనను వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ అయింది. మహిళా కండక్టర్ గతంలోనూ ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించిందని గ్రామస్థులు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది. తాజా ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని సమాచారం. ఉయ్యూరు డిపో ఇన్‌ఛార్జి డీఎం పెద్దిరాజు స్పందిస్తూ.. ఘటనపై పూర్తి సమాచారం సేకరిస్తున్నామని.. బాద్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికుడిపై దాడిని ఆయన ఖండించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కన్నప్ప నయా రికార్డ్ !! ఆదివారం ఒక్కరోజే 40% ఆక్యుపెన్సీ..

నెట్టింట లీకైన కన్నప్ప మూవీ.. ఎమోషనల్ అయిన విష్ణు