రెండు గ్రామాల ప్రజలను కంగారుపెడుతున్న దున్నపోతు
దున్నపోతు పేరు చెబితే ఆ రెండు గ్రామాల ప్రజలు భయంతో హడలిపోతున్నారు. అది బయటకు వస్తుందంటే ఇళ్లను వీడి అడుగు బయటపెట్టడంలేదు. అవును మరి.. ఎవరైనా కనిపిస్తే కుమ్మేస్తోంది ఆ దున్నపోతు. చావుదెబ్బలు తిని మంచాన పడుతున్నారే కానీ దానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ప్రజలు. ఎందుకు? ఆ దున్నపోతు అంత ప్రత్యేకమా అంటే అవుననే అంటున్నారు ఆ గ్రామస్తులు.. ఇంతకీ ఈ దున్నపోతు కథ ఏంటో చూద్దాం..
దున్నపోతు పేరు చెబితే ఆ రెండు గ్రామాల ప్రజలు భయంతో హడలిపోతున్నారు. అది బయటకు వస్తుందంటే ఇళ్లను వీడి అడుగు బయటపెట్టడంలేదు. అవును మరి.. ఎవరైనా కనిపిస్తే కుమ్మేస్తోంది ఆ దున్నపోతు. చావుదెబ్బలు తిని మంచాన పడుతున్నారే కానీ దానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ప్రజలు. ఎందుకు? ఆ దున్నపోతు అంత ప్రత్యేకమా అంటే అవుననే అంటున్నారు ఆ గ్రామస్తులు.. ఇంతకీ ఈ దున్నపోతు కథ ఏంటో చూద్దాం.. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశాపురం, మైలసముద్రం గ్రామస్థులకు ఆ దున్నపోతు పేరు చెబితే వణికిపోతున్నారు. అంతగా ప్రజలను హడలెత్తిస్తున్న ఆ దున్నపోతు స్పెషల్ ఏంటంటే.. అది ఆ గ్రామదేవతకోసం గ్రామస్తులంతా కలిసి వదిలిన దున్నపోతు. దానిని జాతరలో గ్రామదేవతకు బలి ఇస్తారు. అందుకే అది ఎవరిని ఎంతగా కుమ్మేసినా దానిని ఏమీ చేయరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: