బురదలో సేదతీరుతున్న దున్నపోతు.. వీపుపై తట్టిలేపిన సింహం

Updated on: Apr 16, 2025 | 6:54 PM

అదొక అటవీ ప్రాంతం. అక్కడ వేసవి తాపాన్ని తట్టుకోలేక ఓ దున్నపోతు బురదగుంటలో పడుకొని సేదదీరుతోంది. ఇంతలో అక్కడికి ఓ సింహం వచ్చింది. దున్నపోతు వెనుకగా మెల్లగా చప్పుడు చేయకుండా వచ్చిన సింహం దున్నపోతును సేదతీరింది చాలు.. నువ్వు లేస్తే.. నేను కాసేపు రిలాక్స్‌ అవుతా అన్నట్టుగా తన ముందరి కాలుతో దున్నపోతు వీపుమీద మెల్లగా తట్టింది.

దున్నపోతు పట్టించుకోలేదు. మరోసారి సింహం తట్టింది. చిర్రెత్తుకొచ్చిన దున్నపోతు ఒక్కసారిగా గుంతలోంచి పైకిలేచింది. ఆ రియాక్షన్‌కి సింహం అదిరిపడి దూరంగా జరిగింది. నా మానాన నేను గుంటలో పడుకుంటే నన్నే లేపుతావా.. ఆగు నీ పనిచెప్తా అన్నట్టుగా సింహం మీదకు దూసుకెళ్లింది దున్నపోతు. దాని ఆవేశం చూసి.. ఓర్నాయనో.. దీని కోపం చూస్తే కొమ్ములతో కుమ్మేసేలా ఉంది.. అన్నట్టుగా అక్కడినుంచి వెనక్కి తిరిగి చూడకుండా పరుగెత్తింది. దున్నపోతు సింహాన్ని కొంతదూరంవరకూ తరిమేసి మళ్లీ వచ్చి గుంటలోపడుకుంది. ఈ ఘటనను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అందుకే మరి పడుకున్న దున్నపోతుతో పెట్టుకోకూడదు..అని కొందరు.. అసలు ఇది సింహమేనా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను 6 లక్షమంది వీక్షించారు. 3 వేలమందికి పైగా లైక్‌ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై మీ ఇంటికే పెట్రోల్.. బంకుల దగ్గర క్యూ అక్కర్లేదు..

ఆర్ఆర్ఆర్ సెంటిమెంట్.. ఎస్ఎస్ఎంబీ 29 రిలీజ్ అప్పుడే..!

kalyan Ram: తమ్ముడు బక్కచిక్కిపోతే.. అన్నకు ప్రశ్నేంటి?

అమానవీయం.. పీరియడ్స్‌లో ఉన్న విద్యార్థినికి క్లాస్‌ రూమ్‌ బయట పరీక్ష!

Samantha: ఫ్యాన్స్‌ ఎఫెక్ట్‌ సమంతకు కోట్లలో నష్టం