పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో
పాకిస్తాన్‌లోని లాహోర్ యూనివర్సిటీలో దేశ విభజన తర్వాత తొలిసారిగా సంస్కృత కోర్సును ప్రారంభించారు. విద్యార్థులు మహాభారతం, భగవద్గీత శ్లోకాలను నేర్చుకుంటున్నారు. సంస్కృతం ఒక మతానికి చెందినది కాదని, ఈ ప్రాంత ఉమ్మడి సాంస్కృతిక వారసత్వమని ప్రొఫెసర్ షాహిద్ రషీద్ పేర్కొన్నారు. ఇది దక్షిణాసియా ఉమ్మడి సాహిత్య చరిత్రను అర్థం చేసుకోవడంలో కీలక ముందడుగు.
పాకిస్తాన్‌లోని లాహోర్ యూనివర్సిటీలో దేశ విభజన తర్వాత తొలిసారిగా సంస్కృత కోర్సును ప్రవేశపెట్టడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు ప్రస్తుతం మహాభారతం, భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను నేర్చుకుంటున్నారు. ఈ పరిణామం అనేక మందని ఆశ్చర్యానికి గురిచేసినప్పటికీ, ఇది చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రొఫెసర్ షాహిద్ రషీద్ సంస్కృతం ఒక మతానికి మాత్రమే సంబంధించినది కాదని, ఇది ఈ ప్రాంత ఉమ్మడి సాంస్కృతిక చరిత్రకు ప్రతీక అని స్పష్టం చేశారు. సంస్కృత వ్యాకరణాన్ని మొదటిసారిగా గ్రంథస్థం చేసిన పాణిని, ప్రస్తుతం ఖైబర్ పక్తూన్‌ఖ్వా ప్రాంతంలో ఉన్న గాంధార రాజ్యంలో ఉండేవారని ఆయన గుర్తుచేశారు.
