భారతీయుడ్ని పెళ్లాడా.. లైఫ్‌ ఎలా ఉందంటే.. బ్రెజిల్‌ యువతి పోస్ట్‌ వైరల్‌

Updated on: Aug 26, 2025 | 11:06 AM

ప్రేమంటే ఇదేరా అనేలా అనిపించే లవ్‌ స్టోరీలు ఎన్నింటినో చూసుంటారు. వాటన్నింటిలో ప్రేమ ప్రేమే. దాని కోసం ఏం చేయడానికైనా రెడీ అన్నట్లు సిద్ధంగా ఉన్న ప్రేమికులు, వారి గాథలు వింటుంటే ఆశ్చర్యమేస్తుంది. ఎల్లలు, సరిహద్దులు దాటి ఎన్నో ప్రయాసలు పడి ఒక్కటైన జంటలూ ఎందరో. తాజాగా ఓ జంట సినిమా కష్టాలు చూడకపోయినా ఇద్దరూ ఒక్కటైన తీరు చూస్తే..ఎక్కడైనా లవ్వు లవ్వే కదా అనిపించకమానదు.

బ్రెజిల్‌ మహిళ తైనా షా భారతీయ వ్యక్తిని పెళ్లాడింది. ఎలా తమ ప్రేమ చిగురించి పెళ్లిపీటలక్కెందో సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ వైరల్ అవుతోంది. తామిద్దరం భిన్న సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వారమనీ తాను గుజరాతి వ్యక్తితో ఆశ్చర్యకరంగా ప్రేమలో పడ్డట్టు తెలిపింది. 2020 కోవిడ్‌ సమయంలో ఇద్దరు ఆన్‌లైన్‌లో కలుసుకున్నారట. ఇంకా అప్పటికే ఎవరూ టీకాలు వేయించుకోని క్రిటికల్‌ టైంలో ఆమెను కలవాలని గుజరాతీ యువకుడు పడిన ప్రయాసను చూసి..ఫస్ట్‌ మీట్‌లోనే అతని ప్రేమకు ఫిదా అయి లవ్‌లో పడిపోయిందట. ప్రేమలో పడిన ఐదునెలలకే ఇద్దరు పెళ్లిచేసుకున్నాం అని రాసుకొచ్చింది. తమ వివాహం బ్రెజిల్‌లోనే జరిగిందని, తమ పెళ్లికి తన భర్త తరఫు భారతీయ కుటుంబం కూడా అంగీకరించిందని చెప్పుకొచ్చింది తైనా షా. తామిద్దరిది వేర్వేరు నేపథ్యమే అయినా.. ఒకరిపై మరొకరికి అభిమానం, ప్రేమ, గౌరవం రోజు రోజుకి పెరిగిందని, ఈ అనుబంధానికి విశ్వాసానికి సదా కృతజ్ఞతలు అని తెలిపింది తైనా షా. ఈ దంపతుల ప్రేమ కథ నెటిజన్లను తెగ ఆకర్షించడమే గాక, ఎక్కడైనా ప్రేమ.. ప్రేమే..దానికున్న శక్తి అనంతం, అజేయం అంటూ నెట్టింట ఆ జంటని ప్రశంసిస్తూ ఆశీర్వదిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రైమరీ స్కూల్‌లోకి ఏనుగు పిల్ల అడ్మిషన్‌ కావాలేమో అంటున్న నెటిజన్లు