Viral Video: వీడు బాలుడు కాదు.. మహా బలుడు.. ట్రాక్టర్‌నే ఎత్తేశాడు..

Updated on: Feb 21, 2022 | 10:04 AM

సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. పిల్లలు ఆడుకోడానికి బయటకు వెళ్లినప్పుడు వారు రకరకాల సహసాలు చేస్తుంటారు.

సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. పిల్లలు ఆడుకోడానికి బయటకు వెళ్లినప్పుడు వారు రకరకాల సహసాలు చేస్తుంటారు. అలాంటి వీడియోలు కూడా అప్పుడప్పుడూ నెట్టింట దర్శనమిస్తాయి. తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఒక బాలుడు ట్రాక్టర్‌ని అలవోకగా పైకి ఎత్తేసాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొంతమంది పిల్లలు ఒక ఆగి ఉన్న ట్రాక్టర్‌పైన కూర్చుని ఉన్నారు. తర్వాత ఒక బాలుడు ట్రాక్టర్‌ ముందుకు వచ్చి బంపర్‌ని పట్టుకొని పైకి లేపడానికి ప్రయత్నించాడు.. ప్రయత్నించడమేంటి ఎత్తేసాడు.. అయితే అతడు ట్రాక్టర్‌ని సగం వరకు పైకి లేపాడు.. మొత్తం లేపితే ట్రాక్టర్‌ పైన ఉన్న పిల్లలు పడిపోతారని ఆలోచించినట్టున్నాడు లేకపోతే మొత్తం పైకి లేపేసేవాడే. ఇది చూసిన చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోయారు. ఈ వీడియోని నెటిజన్లు తెగ లైక్‌ చేస్తున్నారు. కామెంట్లతో ఆ బాలుడిని ప్రశంసిస్తున్నారు. ఒక నెటిజన్‌ ‘ ఈ పిల్లవాడు బాహుబలి అనుకుంటా’ అంటూ కామెంట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో లక్షల వ్యూస్‌, లైక్స్‌తో సోషల్‌మీడియాలో దూసుకుపోతోంది.