Rare Bird: 140 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించిన అరుదైన పక్షి !!

|

Nov 24, 2022 | 8:52 AM

అంతరించిపోయిన వాటిని తిరిగి తెచ్చే టెక్నాలజీ ఇంకా రాలేదు. ఉన్నవాటిని కాపాడుకోకపోతే.. నెక్ట్స్ తరాలకు వాటిని డైరెక్టుగా చూపించలేం.

అంతరించిపోయిన వాటిని తిరిగి తెచ్చే టెక్నాలజీ ఇంకా రాలేదు. ఉన్నవాటిని కాపాడుకోకపోతే.. నెక్ట్స్ తరాలకు వాటిని డైరెక్టుగా చూపించలేం. మన ముందు తరాలవారు చూసిన ఓ పక్షి.. మళ్లీ కనిపించింది. బ్లాక్ నాప్డ్ అనే అరుదైన పావురం.. 140 ఏళ్ల కిందట చివరిసారి కనిపించింది. తాజాగా పాపువా న్యూ గినియా లో సైంటిస్టులు దీన్ని గుర్తించారు. దట్టమైన అడవిలో ఏర్పాటు చేసిన ఓ కెమెరాకు ఈ పక్షి చిక్కింది. ఇది పావురం అయినప్పటికీ.. చూడటానికి కోడి సైజులో ఉంటుంది. వందేళ్లుగా కనిపించకుండా అంతరించిపోయిన 20 పక్షుల్లో ఇది కూడా ఉంది. అడవిలో తిరిగే స్థానికులు ఇలాంటి వింత పక్షిని తాము చూశామని అటవీ అధికారులకు చెప్పడంతో.. అధికారులు పక్షుల శాస్త్రవేత్తలకు సమాచారమిచ్చారు. సెప్టెంబర్ నెలలో ఇది కనిపించిందని అధికారులు తాజాగా తెలిపారు. బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ సంస్థ, అమెరికన్ బర్డ్ కన్జర్వాన్సీ సంస్థలు.. దశాబ్ద కాలానికి పైగా కనిపించని 150 పక్షులను తిరిగి కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. త్వరలోనే ఈ పక్షుల సంఖ్యను పెంచేందుకు ఉన్న అవకాశాలపై అన్వేషణ సాగించనున్నారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పంటచేలో రంగు రంగుల చీరలు.. ఎందుకో తెలుసా ??

Published on: Nov 24, 2022 08:52 AM