కంటెంట్ ఉన్నోడికి.. కటౌట్‌తో పనిలేదు డ్యూడ్!
మధ్యప్రదేశ్‌కు చెందిన బిట్టూ తబాహి, అజ్నార్ నది ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితం కావడం చూసి చలించిపోయాడు. ఎలాంటి పరికరాలు లేకుండానే నదిని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. స్నేహితుల సాయంతో కొన్ని నెలల్లోనే నది రూపురేఖలు మార్చేశాడు. ఈ కృషికి అంతర్జాతీయ సంస్థ ది ఓషన్ క్లీనప్ నుంచి ఉద్యోగ ఆఫర్ వచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరా పట్టణానికి చెందిన 20 ఏళ్ల సురేందర్ సింగ్ చౌదరి అలియాస్ బిట్టూ తబాహి సాహసం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. స్థానికంగా ప్రవహించే అజ్నార్ నది ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యకూపంగా మారడాన్ని చూసిన బిట్టూ, డిగ్రీ చదువుతూనే దాన్ని తిరిగి జీవనదిగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఎవరి సాయం లేకుండానే, ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఒంటరిగా నది శుభ్రతను ప్రారంభించాడు. బిట్టూ అంకితభావాన్ని మెచ్చుకున్న కొందరు స్థానిక స్నేహితులు అతనికి తోడయ్యారు. అందరూ కలిసి నిరంతరం శ్రమించడంతో కేవలం కొన్ని నెలల్లోనే ఆ నది రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షించింది. పర్యావరణ పరిరక్షణ పట్ల బిట్టూ చూపిన నిబద్ధతను చూసి నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ది ఓషన్ క్లీనప్ ఆవాక్కైంది.
మరిన్ని వీడియోల కోసం :
ముస్తాబైన ఖైరతాబాద్ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది కింగ్ కోబ్రా
పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం! ముప్పులో ఉత్తరాది రాష్ట్రాలు
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు.. ఆదివారం అసలేం జరిగింది?