వింత ఘటన… వలలో చేపలకు బదులు బైకులు వీడియో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విచిత్ర సంఘటన జరిగింది. రోజూలాగే జాలర్లు తమ వలలో చేపలు దండిగా పడాలని కోరుకుంటూ వల వేశారు. అలా వల వేయగానే బరువెక్కింది. దాంతో ఆ జాలర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఏదో పెద్ద చేపే వలకు చిక్కిందని భావించిన వారు వలను పైకి లాగారు. వల చాలా బరువుగా ఉండటంతో నలుగురు కలిసి లాగాల్సి వచ్చింది. తీరా వల పైకి లాగాక అందులో చిక్కింది చూసి వారు షాకయ్యారు.
చేపల కోసం వేసిన వలలో ఓ బైక్ పడింది. భద్రాద్రి జిల్లా తిరుమలకుంట దగ్గర వాగులో స్థానిక యువకులు కొందరు చేపలు కోసం వేసిన వలలో ఈ ద్విచక్ర వాహనం చిక్కింది. నలుగురు యువకులు కలిసి వలను ఒడ్డుకా లాక్కొచ్చి బైకును వలనుంచి బయటకు తీసారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు ఆ యువకులు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ బైకు ఎవరిది? నదిలోకి ఎలా వచ్చింది? ప్రమాదవశాత్తు నదిలోకి దూసుకెళ్లి కొట్టుకుపోయిందా? లేదా ఎవరైనా తీసుకువచ్చి పడేశారా? లేక మరేదైన కుట్ర కోణముందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్ వాటే లైఫ్ వీడియో